‘‘ఆ దర్శకుడు వెన్నుపోటు పొడిచాడు.. స్నేహం కోసం అన్నీ భరించా’’
ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ ప్రస్తుతం ‘’ సినిమాతో బిజీగా ఉన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ తమిళ సినీ రచయిత అజయన్ బాలా రాసిన పుస్తకం ఆధారంగా సినిమాను తీస్తున్నారు విజయ్. అయితే ఈ సినిమాలో తనకు ఎలాంటి క్రెడిట్ ఇవ్వలేందంటూ సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేసారు అజయన్. ‘‘చిత్ర పరిశ్రమలో నాకు ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ ‘తలైవి’ సినిమా విషయంలో నాకు ఎదురైన అవమానాన్ని మాత్రం భరించలేకపోతున్నా. ఆరు నెలల పాటు ఎంతో శ్రమించి రాసిన నవల ఆధారంగా విజయ్ ఈ సినిమా తీస్తున్నారు. కోర్టులో ఎవరో కేసు వేస్తే నా నవలను అడ్డుపెట్టుకుని కేసు నుంచి బయటపడ్డారు. అలాంటిది నాకు క్రెడిట్ ఇవ్వకుండా నా పేరు తీసేసారు. ఎందుకంటే సినిమాలో కొన్ని అసత్యాలు చూపించారని, పలువురు రాజకీయ నేతలను అవమానించారని కొన్ని సన్నివేశాలను తొలగించమని చెప్పాను. దాంతో నా పేరు తీసేసారు. నాది, విజయ్‌ది పదేళ్ల స్నేహం. ఆ స్నేహం కోసం ఎన్నో అవమానాలు భరించాను. కానీ ఈసారి మాత్రం చూస్తూ ఊరుకోలేకపోతున్నాను" " ఈ సినిమా కోసం ఏడాదిన్నర కూర్చుని స్క్రిప్ట్ రాస్తే నాకు వెన్నుపోటు పొడిచాడు’’ అని పేర్కొ్న్నారు. అయితే ఈ పోస్ట్ కొద్ది సేటికే డిలీట్ చేసారు. బహుశా విజయ్ ఫోన్ చేసి క్రెడిట్ ఇస్తామని సముదాయించినట్లున్నారు. అజయన్ బాలా కోలీవుడ్‌లో ఫేమస్ సినీ రచయిత. ‘మణిదాన్’, ‘నేత్రా’ లాంటి ఎన్నో హిట్ సినిమాలకు కథలు అందించారు. ‘తలైవి’ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ జయ లలిత పాత్రలో నటిస్తున్నారు. దివంగత నటుడు ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళ పాత్రలో నటి పూర్ణలు నటిస్తు్న్నారట.
Comments
Post a Comment