ఆ క్రేన్ నా మీద పడుంటే బాగుండేది: డైరెక్టర్ శంకర్ భావోద్వేగం

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ‘ఇండియన్ 2’ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. చెన్నైలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో దురదృష్టవశాత్తు భారీ క్రేన్ కూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. చనిపోయినవారిలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణన్ (35), ఆర్ట్ అసిస్టెంట్ చంద్రు (58), ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు (27) ఉన్నారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కమల్ హాసన్ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ప్రకటించారు. అయితే, ఈ విషాద ఘటనపై తాజాగా డైరెక్టర్ శంకర్ స్పందించారు. ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు. ‘‘తీవ్ర దు:ఖంతో ఈ ట్వీట్ చేస్తున్నాను. ఆ విషాదకర ఘటన జరిగినప్పటి నుంచి నేను షాక్‌లో ఉన్నాను. ఆ ప్రమాదంలో నా అసిస్టెంట్ డైరెక్టర్‌ను, ఇతర సిబ్బందిని కోల్పోవడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. రెప్పపాటులో ఆ క్రేన్ నుంచి నేను తప్పించుకున్నాను. అలాకాకుండా అది నామీ పడుంటే బాగుండేది అని నేను ఫీలవుతున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. వారి కోసం దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’’ అని శంకర్ పేర్కొన్నారు. శంకర్ తీవ్ర భావోద్వేగతంతో ట్వీట్ చేయడంతో ఆయన అభిమానులు, సినీ ప్రేమికులు ఆయనకి సానుభూతి తెలుపుతున్నారు. ‘‘మీ బాధను మేం అర్థం చేసుకోగలం సార్. కానీ, ఆ ప్రమాదం మీ చేతుల్లో లేదుకదా. మీరేం చేయగలరు. మీరు త్వరగా కోలుకోవాలి. మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలి’’ అని కొంత మంది శంకర్‌ను ఓదారుస్తుంటే.. ‘‘షూటింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి సార్’’ అంటూ మరికొందరు సలహాలు ఇస్తున్నారు. మొత్తం మీద ఈ విషాద ఘటన ‘ఇండియన్ 2’ టీమ్‌ను వెంటాడుతోంది. దీని నుంచి వారంతా త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. Also Read:


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ