అనితకు ఓటేయమంటున్న మెహర్ రమేష్.. విషయమేంటి?

ఉదయ్ కిరణ్ హీరోగా దర్శకుడు తేజ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీ ‘నువ్వు నేను’తో హీరోయిన్‌గా పరిచయమైన అనిత గుర్తున్నారు కదా..? టాలీవుడ్‌లో తొలి సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముంబై బ్యూటీ.. సుమారు 10 తెలుగు చిత్రాల్లో నటించారు. అయినప్పటికీ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయారు. కానీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును అయితే సంపాదించుకోగలిగారు. తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ, హిందీ సినిమాల్లో వరసపెట్టి సినిమాలు చేసిన అనితకు ప్రస్తుతం అవకాశాలు లేవు. ప్రస్తుతం ఆమె హిందీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే, అనిత తన భర్త రోహిత్ రెడ్డితో కలిసి ‘నాచ్ బలియే 9’ డ్యాన్స్ షోలో పోటీపడుతున్నారు. ‘రోనిత’ పేరుతో ఈ జోడి కంటెస్ట్ చేస్తోంది. రవీనా టాండన్, అహ్మద్ ఖాన్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న ఈ పాపులర్ డ్యాన్స్ షోలో ‘రోనిత’ జోడి ఫైనల్‌కు చేరింది. వీరితో పాటు మరో నాలుగు జంటలు కూడా ఫైనల్‌కు చేరాయి. ప్రిన్స్ నారులా-యువికా చౌదరి, శాంతను మహేశ్వరి-నిత్యామి షిర్కే, విశాల్ ఆదిత్య సింగ్-మధురిమ తులి, అలై గోని-నటాషా స్టాంకోవిచ్ జోడీలతో ‘రోనిత’ జోడి తుది పోరులో పోటీపడనుంది. Also Read: ఈ షోలో విజేతను నిర్ణయించడంలో ప్రేక్షకుల ఓటింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ‘బిగ్ బాస్’ మాదిరిగానే తమకు ఇష్టమైన కంటెస్టెంట్లకు ఓటింగ్ వేయొచ్చు. అందుకే, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అనిత ఇక్కడి నుంచి ఓట్లను కోరుకుంటున్నారు. ఆమెకు సాయంగా ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ నిలబడ్డారు. ‘రోనిత’ జోడికి ఓటేయ్యాలని ఆయన ట్విట్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులను కోరారు. ‘‘దయచేసి రోనితకు ఓటేయ్యండి. అనిత, రోహిత్ !!! నాచ్ బలియేలో రోనిత ఫైనల్‌కు చేరుకున్నారు. అనిత ‘నువ్వు నేను’ ఫేమ్. మీ ప్రేమను వాళ్లపై కురిపించండి. ఈ నంబర్‌కు మీరు ఇచ్చే ఒక్క మిస్డ్ కాల్ వాళ్లను గెలిపిస్తుంది: 1800120888807’’ అని రమేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మీలో ఎవరైనా అనిత అభిమానులు ఉన్నారా? అయితే, ఇంకెందుకు ఆలస్యం జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చేయండి. మీ ఒక్క ఓటు ఆమెను విజేతను చేయొచ్చు!!


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ