Amy Jackson: కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన అమీ జాక్సన్.. నాలుకలతో కిస్సింగ్.. ఖర్మరా బాబూ..!

బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ (Amy Jackson) తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్ సరసన నటించిన అమీ జాక్సన్.. ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. ఆ మధ్య బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటౌతో డేటింగ్ చేసి అమీ వార్తల్లో నిలిచింది. పెళ్లికాకుండానే ఆయనతో బిడ్డను కూడా కనేసింది. అయితే, బిడ్డ పుట్టిన కొన్నాళ్లకే జార్జ్‌ పనాయోటౌకు గుడ్‌బై చెప్పేసింది అమీ. ప్రస్తుతం ఈ నటి హాలీవుడ్ స్టార్ ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేస్తోంది. తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన రొమాంటిక్ ఫొటోలను అమీ జాక్సన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

Comments