Varun Tej: గాండీవధారి అర్జున.. సీరియస్ యాక్షన్‌తో వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ కెరీర్లో 12వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రెండు రోజుల కిందట #VT12కు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ను జనవరి 12న రివీల్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. అన్నట్లుగానే తాజాగా మూవీ టైటిల్‌తో పాటు వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్‌ను ఎస్వీసీసీ అధికారిక ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది.
Comments
Post a Comment