Megastar Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ వేదిక మార్పుపై నో కామెంట్స్.. ఫంక్షన్లో చూడండి: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. రవితేజ కీలక పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ సినిమాను నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 13న విడుదలవుతుంది. ఆదివారం సాయంత్రం భారీ ఎత్తున వైజాగ్ ఏయూ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఇప్పటికే చిరు, రవితేజ సహా మెయిన్ టీమ్ అంతా స్పెషల్ ఫ్లైట్‌లో వైజాగ్ చేరుకున్నారు.
Comments
Post a Comment