LA Film Critics: కీరవాణి మరో ఘనత.. గోల్డెన్ గ్లోబ్ తర్వాత RRRకి అరుదైన గుర్తింపు
RRR సినిమా మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం అంతర్జాతీయ అవార్డులను అందుకుంటూ దూసుకెళ్తోంది. ఇటీవలే RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ (LA Film Critics) అవార్డులో ఎం.ఎం.కీరవాణికి బెస్ట్ స్కోర్ కేటగిరిలో అవార్డ్ దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ సినిమా తమ సోషల్ మీడియా మాధ్యమంలో ప్రకటిచింది.
Comments
Post a Comment