Jr NTR న్యూ లుక్ వైరల్.. ‘బాద్షా’తో పోల్చిన బండ్ల గణేష్
ఎన్టీఆర్ (Jr NTR) సినిమా అప్డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న 30వ సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, ఈ సినిమా ఆగిపోతుంది అనే రూమర్లు రావడంతో ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. కానీ, చిత్ర యూనిట్ ఇటీవల ఒక అప్డేట్ ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం కొరటాల శివ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Comments
Post a Comment