నా కూతురు, అల్లుడిని ఆశీర్వదించిన అతిరథ మహారథులకు కృతజ్ఞతలు: ఆలీ
టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ (Ali) పెద్ద కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, కె.రాఘవేంద్రరావు, మురళీమోహన్, బ్రహ్మానందం, ఎస్వీ కృష్ణారెడ్డి, మంత్రి రోజా, సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు వివాహానికి హాజరయ్యారు. తన కుమార్తె వివాహానికి హాజరైన అతిరథ మహారథులు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆలీ ఒక ప్రకటన విడుదల చేశారు.
Comments
Post a Comment