RRR మీద ఇంత ప్రేమ చూపిస్తారని అనుకోలేదు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రాజమౌళి (rajamouli) తాజాగా టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా గురించి, దాని మీద వచ్చిన విమర్శలు, ప్రశంసలు మీద స్పందించాడు. మరీ ముఖ్యంగా వెస్ట్రన్ ఆడియెన్స్ ఆర్ఆర్ఆర్ సినిమా మీద కురిపించిన ప్రేమను చూసి ఆశ్చర్యపోయానంటూ రాజమౌళి చెప్పుకొచ్చాడు. తాను ఇప్పటికీ లర్నింగ్ స్టేజ్లో ఉన్నానని, తనకు ఏమీ తెలియదని రాజమౌళి ఎంతో వినయంగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట్లో చెక్కర్లు కొట్టేస్తోంది.
Comments
Post a Comment