Rama Rao On Duty : రవితేజ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. మళ్లీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ వాయిదా
మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. మరో మూడు నాలుగు వారాల్లో రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఫ్యాన్స్ సహా అందరికీ మేకర్స్ షాకిచ్చారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను మళ్లీ వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని చెప్పారు. అసలు ఎందుకు సినిమాను వాయిదా వేశామనే విషయంపై చిత్ర యూనిట్ వివరణ ఇవ్వలేదు.
Comments
Post a Comment