Security to Suriya : హీరో సూర్య ‘ఈటి’ సినిమాపై అభ్యంతరాలు.. ఇంటికి పోలీసుల భద్రత
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ఇప్పుడు వాటికి కేరాఫ్ అడ్రస్ అయిపోయారా? అని అనిపించేలా ఉంది. అందుకు కారణం.. ఆయన ఏదో వ్యాఖ్యలు చేయడమో, ఎవరినైనా టార్గెట్ చేసి మాట్లడటమో చేయడం లేదు. ఇది వరకు కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఆయన చేసిన ట్వీట్ ఓ కారణమైతే, జై భీమ్ సినిమాలో వన్నియార్ సంఘాన్ని కించపరిచారంటూ వ్యతిరేకత వచ్చింది. పీఎంకే పార్టీ నాయకులు, వన్నియార్ సంఘం నాయకులు సూర్యను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ (ఎవరికీ తలవంచడు)’ సినిమా రిలీజైన సంగతి తెలిసిందే. కడలూరు, విలుపురం జిల్లాల్లో అయితే ఈటి సినిమాను నిషేధించాలని చెబుతూ కలెక్టర్స్ కార్యాలయాల్లో సదరు నాయకులు వినతి పత్రాలు కూడా అందజేశారు. దీంతో సూర్య ఇంటి వద్ద తుపాకులతో ఉన్న పోలీలసులను కాపలాగా ఉంచారు. ఇంతకు ముందు జై భీమ్ సినిమా రిలీజ్ తర్వాత వివాదం రేగింది. అప్పుడు కూడా ఆయన ఇంటికి పోలీసు భద్రతను కలిపించిన సంగతి తెలిసిందే. జై భీమ్ సినిమా అంటే.. ఏదో ఓ వర్గాన్ని తప్పుగా చూపించారన్నరని వివాదం చేస్తే ఓకే అనుకోవచ్చు కానీ.. ఇప్పుడు ఈటి సినిమాలో మహిళల ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల సమస్యను ప్రశ్నించేలా ఉందని, దానిపై అభ్యంతరాలు చెప్పడం ఎందుకని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు. సూర్య, ప్రియాంక అరుల్ మోహన్ హీరో హీరోయిన్లుగా సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈటి(ఎవరికీ తలవంచడు)’. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఓ సమస్య గురించి ఈ చిత్రంలో చర్చించారు. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం మార్చి 10న రిలీజ్ అయ్యింది. రెండున్నరేళ్ల తర్వాత సూర్య నటించిన చిత్రం థియేటర్స్‌లో విడుదలైంది. ఇంతకు ముందు సూర్య హీరోగా నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదలయ్యాయి.
Comments
Post a Comment