అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ఫూల్స్ డే అంటూ అనసూయ పోస్ట్! నెట్టింట దుమ్ముదుమారం

నేడు (). స్త్రీ ప్రాధాన్యతను తెలియజేస్తూ ప్రతి ఏడాది మార్చి 8న ఇంటర్నేషనల్ విమెన్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన ఓ పోస్ట్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ సమాజంలోని మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తున్నారు. పురుషులతో సమానంగా ఉద్యోగాల్లో భాగం కావడం, పారిశ్రామిక వేత్తలుగా ఎదగడం, ఇల్లాలిగా కుటుంబ బాధ్యతలు మోయడం ఇలా అన్నింటా ముందుంటున్నారు. అయితే ముందడుగేస్తున్న మహిళలను ప్రోత్సహించడం మరిచి ట్రోల్ చేసేవారు చాలా మందే ఉన్నారు. అలాంటి ట్రోలర్స్ అందరికీ తాజాగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది యాంకర్ అనసూయ. ''అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగానే ప్రతి ట్రోలర్, మీమర్ సడెన్‌గా మహిళలకు గౌరవమిస్తూ సందేశాలు పెట్టడం షురూ చేస్తారు. కాకపోతే అది 24 గంటల్లోనే ముగుస్తుంది. కాబట్టి అలాంటివి నమ్మకండి. హ్యాపీ ఫూల్స్ డే'' అంటూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది అనసూయ. ఈ పోస్ట్‌ చూసి ఈ సమాజంలో మహిళలకు గౌరవమిచ్చే వాళ్ళు లేరనే ఉద్దేశంతోనే అనసూయ ఇలా అనేసిందని అంటున్నారు నెటిజన్లు. అంతేకాదు అందరు మగ్గాళ్లు ఒకేలా ఉండరని, గుడ్డిగా అలా అనుకోవడం నీ తప్పు అంటూ అనసూయపై అటాక్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ట్రోల్స్ బారిన పడటం అనసూయకు కామన్. ఆమె డ్రెస్సింగ్ సెన్స్, బిహేవియర్ విషయమై చాలాసార్లు ట్రోల్స్‌కి గురైంది. అయితే తనపై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి తిరిగి కౌంటర్స్ వేసింది అనసూయ. ప్రస్తుతం బుల్లితెర, వెండితెరపై వరుస ఆఫర్స్‌తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లొకేషన్స్‌‌లో బిజీ బిజీగా గడుపుతోంది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ