Akhanda Kruthagnatha Sabha : చరిత్ర సృష్టించాలన్నా మేమే.. చరిత్ర తిరగరాయాలన్నా మేమే: బాలయ్య స్పీచ్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. బాలయ్య కెరీర్‌లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా అఖండ నిలిచింది. రెండు వారాలు కంటిన్యూగా ఆడటమే గగనం అయిన ఈ రోజుల్లో ఏకంగా యాభై రోజులు అఖండ సినిమా విజయవంతంగా నడిచింది.ఇక ఈ సినిమా వంద రోజులను పూర్తి చేసుకోవడంతో కృతజ్ఞత సభను అఖండ టీం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో తనదైన శైలిలో ప్రసంగాన్ని ప్రారంభించాడు. శివుడి గొప్పదనం చెబుతూ శ్లోకాలను చదివి వినిపించాడు. ఇంత గొప్ప సినిమాను నిర్మించినందుకు నిర్మాతకు, విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞత సభకు విచ్చేసిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఓ మంచి సినిమా తీయాలనే సంకల్ప బలీయంతోనే మొదలుపెట్టాం. ఏ సినిమా తీసినా అలానే చేశాం. ఒక సినిమా చేసే సమయంలో ఇంకో సినిమా గురించి ఆలోచించలేదు. సింహా, లెజెండ్, అఖండ సమయంలో ఇంకో సినిమా గురించి మాట్లాడుకోలేదు. ఈశ్వరుడి అనుమతి లేనిదే చీమ కూడా కుట్టదని అంటారు. ఈ సినిమా ప్రారంభించడం, కరోనా మహమ్మారి రావడం, ప్రపంచ అంతా కూడా అతలాకుతలం అవ్వడం, షూటింగ్ ఆపడం, పున ప్రారంభించడం జరుగుతూ వచ్చింది. సినిమా విడుదలై విజయవంతమైంది. సినిమాను ప్రేక్షకులు నిత్యావసర సరుకుగా ఎంచుకున్నారు. ఇలాంటి సమయంలో మంచి చిత్రాలను తెరకెక్కించారు. ఆ బాధ్యత దర్శక నిర్మాతల మీదుంది. సినిమా అంటే ఆలోచన రేకెత్తించేది.. వినోదాన్ని పంచేది. ఈ సినిమా గురించి రెండు మాటల్లో చెబుతాను. మన హైందవ సనాతన ధర్మాన్ని నిలబెట్టిన, గుర్తు చేసిన చిత్రం అఖండ. ప్రకృతి, పసిపాపలు, ధర్మం జోలికి వెళ్లినా, అపాయం కల్గించిన భగవంతుడు ఏదో ఒక రూపంలో వస్తాడు అనే పాత్రను రూపొందించింది. అంతటి సందేశాన్ని అందించింది అఖండ చిత్రం. ఇటువంటి సినిమాను అఖండవంతమైన విజయాన్ని చేకూర్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. వేనోళ్ల పొగిడిన చిత్రం అఖండ. ఇంత మంచి సందేశాత్మక చిత్రం రావడంలో మేమంతా పరికిరాళ్లం. మా ద్వారా ఇటువంటి సినిమా రావడం, మాకు ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా దర్శకులు బోయపాటి గురించి ఎక్కువగా చెప్పుకోను. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. మేం ఖర్చును దృష్టిలో పెట్టుకోం. కథ, దాని నేపథ్యం ఎలా ఉండాలో చూసుకుంటాం. కట్టె కొట్టే తెచ్చే అన్నట్టుగా కథను రెడీ చేస్తాం. అఖండ సినిమాకు ఇంతటి ఘన విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. నటుల నుంచి నటనను రాబట్టుకోగల సత్తా ఉన్న దర్శకుడు బోయపాటి గారు. సహజం, కృత్రిమ సినిమాలెన్నో చేశాను. అఖండ లాంటి సహజమైన సినిమాతో అఖండ విజయం చూశాను. దీనికి కారణం ప్రేక్షకులే. మంచి సినిమాలు మాకు ఇంకా అందించండి అని అంటోన్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కర్నూలు జిల్లాలోని మూడు కేంద్రాల్లో వంద రోజులు జరుపుకుంటోంది. అందుకే ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేశాం. అభిమానులే కాదు ప్రేక్షకులంతా కూడా ఆదరించడంతోనే ఈ సినిమా ఇంత హిట్ అయింది. ఇంత మంచి సినిమా తీయడంతో కేవలం తెలుగు వాళ్లే కాదు.. మొత్తం యావత్ భారతదేశం తలెత్తుకునేలా అఖండ సినిమా చేసింది. ప్రతీ ఒక్క భారతీయుడు, తెలుగువాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేసేందుకు వచ్చాం. చరిత్రను సృష్టించాలన్నా నేను..దాన్ని తిరగరాయాలన్నా మేమే.. మా సినిమాలే మాకు పోటీ.. సింహకి పోటీ లెజెండ్.. లెజెండ్‌కి పోటీ అఖండ.. ఇంకా ఎన్నెన్నో మంచి చిత్రాలు రెడీ అవుతాయి’ అని చెప్పుకొచ్చాడు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ