Sukumar : మెగాస్టార్ చిరంజీవి విష‌యంలో సుకుమార్ ప‌క్క దారి ప‌ట్టించారా?

సినిమాల‌ను ఎంత స్పీడుగా పూర్తి చేస్తున్నారంటే కుర్ర హీరోలు సైతం ఆయ‌న స్పీడు చూసి షాక‌వుతున్నారు. ఇప్ప‌టికే ఆచార్య సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేసిన చిరంజీవి గాడ్ ఫాద‌ర్ సినిమాను పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భోళా శంక‌ర్‌, బాబి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న మ‌రో చిత్రం సెట్స్‌పై ఉంది. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఇవ‌న్నీ కాకుండానే ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా ఉంటుంద‌నే ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. దానికి తోడు చిరంజీవితో సుకుమార్ ఉన్న ఫొటో కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతుంది. ఓ వైపు సుకుమార్‌, మ‌రో వైపు చిరంజీవి వారి వారి ప్రాజెక్టుల‌తో ఫుల్ బిజీగా ఉన్నారుగా. వారి కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడు ఉంటుందోన‌ని ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది. అయితే తాజాగా, మెగాస్టార్ చిరంజీవి - సుకుమార్ కాంబో విష‌యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేంటంటే.. చిరంజీవిని సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న మాట నిజ‌మే. అయితే అది సినిమా కాద‌ట‌. క‌మ‌ర్షియ‌ల్ యాడ్ అని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. అయితే అది బ‌య‌ట‌కు సినిమా చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన ఎలాంటి క్లారిటీ అయితే సుకుమార్ సైడ్ నుంచి రాలేదు. చిరంజీవితో చేసే క‌మ‌ర్షియ‌ల్ యాడ్ విష‌యంలో సుక్కు సోష‌ల్ మీడియాను ప‌క్క దారి ప‌ట్టించార‌నే వార్త‌లు సినీ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇక చిరంజీవి విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో క‌నీసం ఒక‌టో రెండో పూర్తి అయితే కానీ.. నెక్ట్స్ ప్లాన్ చేయ‌లేరు. అయినా ఇప్ప‌టికే వెంకీ కుడుముల లైన్‌లో ఉండ‌నే ఉన్నారు. ఇక సుకుమార్ అయితే పుష్ప సినిమాకు సీక్వెన్స్‌గా రూపొంద‌నున్న పుష్ప ది రూల్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వ‌తున్నారు. ఈ గ్యాప్‌లో చిరంజీవి న‌టించ‌నున్న రియ‌ల్ ఎస్టేట్ క‌మ‌ర్షియ‌ల్ యాడ్‌ను డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ట‌.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ