RRR మార్చ్ పోస్టర్ వైరల్.. జక్కన్న ప్రమోషన్ టెక్నిక్ అదుర్స్!!

సినిమా గ్రాండ్‌గా రూపొందించడంలో ఎంత కేర్ తీసుకుంటారో చిత్ర ప్రమోషన్స్ విషయంలోనూ సరికొత్తగా ఆలోచిస్తూ మరింత శ్రద్ద పెడుతుంటారు రాజమౌళి. ఈ క్రమంలోనే రెండో దశ ప్రమోషన్స్ షురూ చేసిన ఆయన సరికొత్త స్ట్రాటజీని ప్రేక్షకుల ముందుంచారు. ఈ నెల అనగా మర్చి 25న ఈ భారీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో RRR మార్చ్ అంటూ ఓ స్నాప్ షాట్ రిలీజ్ చేసి ప్రమోషన్స్‌లో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. RRR మార్చ్ అనే పేరుతో ఉన్న స్నాప్ షాట్ తీసుకొని ఇందులో మీకు ఇష్టమైన ఇమేజ్ పెట్టుకొని మీ మీ సోషల్ మీడియా వాల్స్‌పై పోస్ట్ చేసుకోండి అంటూ ఈ స్నాప్ షాట్ వదిలారు. దీంతో ఇంకేముంది నెటిజన్లు తమ తమ టాలెంట్‌కి పదును పెడుతూ ఈ స్నాప్ షాట్ పోస్టర్ వైరల్ చేసేస్తున్నారు. కొందరు ఎన్టీఆర్ ఫొటోతో ట్రెండ్ చేస్తుంటే, ఇంకొందరు రామ్ చరణ్ ఫొటోతో ట్రెండ్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఈ స్నాప్ షాట్‌లో తమ తమ పిక్స్ పెట్టుకొని షేర్ చేసుకుంటూ తెగ మురిసిపోతున్నారు. దీంతో ట్విట్టర్ వేదికపై మరోసారి RRR హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. 1920 బ్యాక్ డ్రాప్‌లో భారీ రేంజ్‌లో RRR మూవీ రూపొందించారు జక్కన్న. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ పోషించగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం రోల్‌లో కనిపించబోతున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా, అజయ్ దేవగన్, శ్రీయ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియోస్ సినిమాపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశాయి. నిజానికి ఈ సినిమాను ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు జక్కన్న. ఈ మేరకు ఓ రేంజ్ ప్రమోషన్స్ కూడా చేపట్టారు. అయితే ఊహించని విధంగా కరోనా మరోసారి విజృంభించడంతో కొద్ది రోజులు వాయిదావేసి మార్చి 25న విడుదల చేస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ