Pawan Klayan : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘భీమ్లా నాయక్’ ... 100 కోట్లు మార్క్ టచ్ చేసిన పవన్ కళ్యాణ్.. ఏరియా వైజ్ కలెక్షన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’. రానా దగ్గుబాటి ఇందులో మరో హీరోగా నటించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సంపాదించుకోవడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌ను గట్టిగానే రాబడుతుంది. మూడు రోజుల్లోనే ‘భీమ్లా నాయక్’ వంద కోట్లు మార్క్‌ను టచ్ చేసింది. కరోనా థర్డ్ వేవ్ తర్వాత సినిమా థియేటర్స్‌కు ప్రేక్షకులు వస్తారా? రారా? అనే మీమాంసను నిర్మాతలు ఎదుర్కొంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ తన సత్తాను చూపించారు. ‘భీమ్లా నాయక్’ సినిమా వంద కోట్ల గ్రాస్‌ను రాబట్టుకోవడంపై ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. సినీ సర్కిల్స్‌లో సైతం ‘భీమ్లా నాయక్’ సమ్మర్ సినిమాలకు గేట్‌లాగా వ్యవహరించిందని.. ఓ నమ్మకాన్ని క్రియేట్ చేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. 3వ రోజు ఏరియా వైజ్ షేర్ కలెక్షన్స్ (కోట్లలో..) నైజాం - రూ. 6.55 కోట్లుసీడెడ్ - రూ. 2.2 కోట్లుగుంటూరు - రూ. 0.72 కోట్లుకృష్ణా - రూ. 0.76 కోట్లునెల్లూరు - రూ. 0.41 కోట్లువెస్ట్ - రూ. 0.47 కోట్లుఈస్ట్ - రూ. 0.91 కోట్లుఉత్తరాంధ్ర - రూ. 1.5 మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజున ‘భీమ్లా నాయక్’ చిత్రం రూ.13.15 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్‌ను సాధించింది. 3 రోజులకు కలిపి షేర్ వసూళ్ల పరంగా సినిమా రూ.53.08 కోట్లు వచ్చాయి. 3వ రోజు రాష్ట్రాల పరంగా వచ్చిన గ్రాస్ కలెక్షన్స్ (కోట్లలో..) ఆంధ్ర, తెలంగాణ - రూ.21.60 కోట్లుకర్ణాటక - రూ. 1.45 కోట్లురెస్టాఫ్ ఇండియా - రూ. 0.55 కోట్లుమూడు రోజులకు కలిపి రూ.89.40 కోట్లు వచ్చాయి. ఓవర్ సీస్ వసూళ్లు.. ఓవర్ సీస్‌లో ‘భీమ్లా నాయక్’ రెండు మిలియన్ డాలర్స్‌ను దాటేసింది. మన లెక్కల్లో చూస్తే రూ.20.60 కోట్లు వచ్చాయి. అంటే మొత్తంగా చూస్తే రూ.110 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ‘భీమ్లా నాయక్’ సాధించింది. ఇక కీలకమైన సోమవారం ‘భీమ్లా నాయక్’ ఎంత మేరకు వసూళ్లను సాధిస్తుందో చూడాలి.
Comments
Post a Comment