Pawan Kalyan Next Movie : ప్రభాస్ దర్శకుడితో పవన్ కళ్యాణ్.. మరోసారి అలాంటి పాత్రలోనే!

రీసెంట్‌గా రిలీజైన ‘’తో సెన్సేష‌న‌ల్ హిట్ అందుకున్నారు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక ఓవ‌ర్ సీస్‌లోనూ సినిమా రెండు మిలియ‌న్ వ్యూస్‌ను ద‌క్కించుకోవ‌డం విశేషం. క‌రోనా థర్డ్ వేవ్ త‌ర్వాత టాలీవుడ్‌కి ‘భీమ్లా నాయక్’ స‌క్సెస్ కొత్త ఉత్సాహాన్నిచ్చింద‌నే చెప్పాలి. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాబోయే చిత్రాల‌పై భీమ్లా నాయ‌క్ ఎఫెక్ట్ బాగానే క‌నిపిస్తుంది. అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేయాల్సిన చిత్రాలు చాలానే లిస్టులో ఉన్నాయి. ఇప్ప‌టికే ‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ మూవీ సెట్స్‌పై ఉంది. చిత్రీక‌ర‌ణ‌న‌ను పూర్తి చేసుకుంటోంది. ఇది కాకుండా హ‌రీష్ శంక‌ర్ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఇది కాకుండా డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ చిత్రాలు కాకుండా ప‌వ‌న్ కొత్త చిత్రాల‌కు సుముఖ‌త చూపిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి కూడా తెలిసిందే. త‌మిళ చిత్రం వినోద‌య సీత‌మ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌నున్నార‌ని, ఇందులో మేన‌ల్లుడితో క‌లిసి ప‌వ‌న్ న‌టించ‌బోతున్నార‌నేది ఓ వార్త. అయితే మ‌రో త‌మిళ రీమేక్ సినిమాలోనూ న‌టించ‌డానికి ప‌వ‌న్ ఆస‌క్తి చూపార‌ని ఓ యువ‌ ద‌ర్శ‌కుడికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లు ప‌వ‌న్ చేయ‌బోతున్న కొత్త సినిమా ఏంటి? ఆ యంగ్ డైరెక్ట‌ర్ ఎవ‌రు? అనే వివ‌రాల్లోకి వెళితే.. త‌మిళంలో ద‌ళ‌ప‌తి హీరో విజ‌య్ న‌టించిన ‘తెరి’ సినిమాను తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారంటూ చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్ సినిమాలో న‌టించ‌డానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓకే చెప్పార‌ట‌. ఇంత‌కీ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోయేది ఎవ‌రో తెలుసా! ప్ర‌భాస్‌తో పాన్ ఇండియా మూవీ ‘సాహో’ని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు సుజిత్‌. ప్ర‌ముఖ నిర్మాత డివివి దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఇదే క‌నుక నిజ‌మైతే మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ..ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తార‌న్న‌మాట‌.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ