Nagababu : సినీ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ ఇవ్వకపోవడం దురదృష్టకరం : నాగబాబు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఫిబ్రవరి 25న సినిమా విడుదలైంది. సినిమా టికెట్స్ పెంపుకు సంబంధించిన జీవోను ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అందులో మాట్లాడుతూ ‘‘వకీల్ సాబ్ సినిమా నుంచి ప్రభుత్వం నేటి వరకు సినీ పరిశ్రమను, పవన్ కళ్యాణ్‌ను ఏపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ప్రభుత్వం పవన్ కళ్యాణ్‌పై పగతో ఇలా చేస్తున్నప్పటికీ సినీ పరిశమ్ర నుంచి, సినీ పెద్దలు నుంచి మద్దతు రాకపోవడం శోచనీయం. ఇలా చేయడం తప్పు అని చెప్పడం కానీ, ట్వీట్స్ వేయడం కానీ ఎవరూ చేయడం లేదు. సినీ పరిశ్రమ అభద్రతను కళ్యాణ్‌బాబు, ఆయనతో ఉన్న నాలాంటి వాళ్లు అర్థం చేసుకోగలం. పెద్ద హీరోకే ఇలా ఉంటే సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి? వాళ్లు ఎంత బాధపడుతున్నారు. నాపై ఏమైనా కోపం ఉంటే నాపైనే చూపించండి. ఇండస్ట్రీ మీద కాదు అని రిపబ్లిక్ సినిమా వేడుకలో పవన్ కళ్యాణ్ అన్న మాటలకు ఇప్పుడు వాళ్లు కరెక్ట్ ఉపయోగించుకుంటున్నారు. అయితే మీరెవరూ దానిపై ఒక మాట కూడా మాట్లాడకపోవడం దురదృష్టకరం. భీమ్లా నాయక్ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. ప్రజలు సినిమాను ఆదరించారు. ఒకవేళ ఈ సినిమా సరిగ్గా ఆడకపోయుంటే కళ్యాణ్ బాబు నష్టమేమీ వచ్చుండేది కాదు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, నిర్మాత నష్టపోయేవారు. దేవుడి దయ వల్ల సినిమా హిట్ అయ్యింది. అయితే సినీ ఇండస్ట్రీకి సినిమా వ్యక్తిగా ఓ విషయం చెప్పాలనుకుంటునాను. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఏ ప్రభుత్వం ద్వారా అయినా వస్తే కచ్చితంగా మీకోసం మేం నిలబడతాం. మీరు మాకు సహకారం అందించకపోయినా పరావాలేదు. మేం మీకు అండగా నిలబడతాం’’ అన్నారు.
Comments
Post a Comment