Bheemla Nayak : ‘భీమ్లా నాయ‌క్’ వివాదంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ఎప్పుడైనా అలా స్పందించారా? అంటూ ప్ర‌శ్నించిన పేర్ని నాని

‘భీమ్లా నాయ‌క్’ సినిమా విష‌యంలో ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు ఓ రేంజ్‌లో వినిపించాయి. ప్ర‌భుత్వంపై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌పై ఏపీ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఈ క్ర‌మంలో ‘భీమ్లా నాయ‌క్’ సినిమాకు అస్స‌లు సంబంధం లేని జూనియ‌ర్ ఎన్టీఆర్ పేరుని ఆయ‌న ప్ర‌స్తావించారు. అస‌లు ‘భీమ్లా నాయ‌క్’ సినిమాకు ఎన్టీఆర్ ఏంటి సంబంధం అనే వివ‌రాల్లోకి వెళితే.. ‘‘భీమ్లా నాయక్ సినిమాను తొక్కేస్తున్నామ‌ని అంటున్నారు. సినిమాన ఎక్క‌డైనా తొక్కేయ‌డాని వీల‌వుతుందా? సినిమా బావుంటే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు. ఇక ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన జీవో బ్లాక్ టికెటింగ్‌ను రూపు మాప‌డానికి. కానీ ప్ర‌తి ప‌క్ష పార్టీలు అన్నీ బ్లాక్ మార్కెటింగ్‌ను ప్రోత్స‌హిస్తున్నాయి. అలాగే బ్లాక్ మార్కెటింగ్‌ను త‌ప్పు ప‌ట్టాల్సిన మీడియాలో కొంత మందికి దానికి అనుకూలంగా మాట్లాడ‌టం వింటే ఆశ్చ‌ర్యంగా అనిపించింది. టికెట్ రేట్స్‌పై జీవోను నిలిపి కలెక్ట‌ర్‌ను సంప్ర‌దించి టికెట్ రేట్స్ పెంపుద‌ల‌పై అనుమ‌తులు తీసుకోవ‌చ్చున‌ని హైకోర్టు తీర్పు చెప్పింది. కానీ ఎవ‌రూ అలా చేయ‌డం లేదు. మీకు కోర్టులు, ప్ర‌భుత్వాలు అంటే లెక్క‌లేదంటే ఎలా? మా ఇష్టా రాజ్యం అంటే ఎలా కుదురుతుంది? ఇక సినిమా టికెట్స్‌కు సంబంధించిన జీవోను ఆల‌స్యంగా విడుద‌ల చేశామ‌ని అంటున్నారు. నిజానికి ఈ నెల 21న సినిమా టికెట్స్‌కు సంబంధించిన క‌మిటీతో భేటీ.. 22న హోం సెక్ర‌ట‌రీ ఓ డ్రాఫ్ట్‌ను రూపొందించి దాన్ని లా క‌మీష‌న్‌కు పంపించ‌టం, 23 లేదా 24న జీవో రావ‌డం అనేది ప్లాన్. కానీ మా మిత్రుడు, మంత్రి గౌత‌మ్ రెడ్డి అకాల మ‌ర‌ణం చెంద‌టంతో జీవో ఆల‌స్య‌మైంది’’ అన్నారు పేర్ని నాని. ఇదే సంద‌ర్భంలో నారా లోకేష్ గురించి పేర్ని నాని మాట్లాడుతూ ‘‘ఇంకా ‘భీమ్లా నాయ‌క్’ సినిమా రిలీజ్ కానే లేదు. అప్పుడే లోకేష్ సినిమా బావుంటుందని, సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నానని అన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంటే ఎప్పుడైనా ఇలా అన్నారా! అని ప్ర‌శ్నించారు’’ అన్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ