Bheemla Nayak : గాడ్ ఫాదర్ .. భీమ్లా నాయక్ కలిస్తే.. అరుదైన వీడియో షేర్ చేసిన రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈరోజు ఉదయం పది గంటలకు తన సోషల్ మీడియాలో ఓ అరుదైన వీడియోను షేర్ చేస్తానని తెలిపారు. దీంతో అందరూ ఆయన హీరోగా నటించిన RRR లేదా ఆచార్య సినిమాకు సంబంధించిన ఏదైనా వీడియోను షేర్ చేస్తారేమోనని భావించారు. కానీ ఆయన షేర్ చేసిన వీడియో చూసి ఫ్యాన్స్, ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు. ఇంతకీ అందరూ అంతలా థ్రిల్ అయ్యేలా రామ్ చరణ్ షేర్ చేసిన వీడియో ఎవరిదో తెలుసా.. తండ్రి , బాబాయ్ పవన్ కళ్యాణ్‌లది. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా సెట్స్‌ను చిరంజీవి ప్రత్యేకంగా విజిట్ చేశారు. అది కూడా ఆయన షూటింగ్ చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమా డ్రెస్‌లోనే. ఇంతకీ చిరంజీవి వేసుకున్న డ్రెస్ ఏదో తెలుసా? ఖైదీ నెం.786 అనే ఖైది డ్రెస్. చిరంజీవి రాకను పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ తెగ ఎంజాయ్ చేశారు. అలాగే తర్వాత గాడ్ ఫాదర్ సెట్స్‌ను పవన్ కళ్యాణ్ విజిట్ చేశారు. ఆయనకు తోడుగా త్రివిక్రమ్ కూడా వచ్చారు ఆ సమయంలో చిరంజీవి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులతో మాట్లాడుతున్నారు. వారిలో విజయేంద్ర ప్రసాద్, ఆర్.నారాయణమూర్తి తదితరులున్నారు. ఇలా భీమ్లా నాయక్‌ను గాడ్ ఫాదర్.. గాడ్‌ఫాదర్‌ను భీమ్లా నాయక్ కలుసుకున్న అపూర్వ క్షణాలను వీడియోలో బంధించి దాన్ని ఈరోజు విడుదల చేశారు రామ్ చరణ్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ రెండు చిత్రాల్లో ముందుగా భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25న విడుదలవ అవుతుంది. చిరంజీవి విషయానికి వస్తే.. ఆయన నటిస్తోన్న గాడ్ ఫాదర్ చిత్రం, మలయాళ సినిమా లూసిఫర్‌కు రీమేక్.
Comments
Post a Comment