Bheemla Nayak Location : భీమ్లా నాయక్ లొకేషన్‌లో స్టిల్ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తిన పవన్ కళ్యాణ్.. ఫొటో వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ అగ్ర కథానాయకుల్లో ఒకరనే సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆయన మంచి టెక్నీషియన్. జానీ సినిమాకు ఆయనే డైరెక్టర్. సాధారణంగా కెరీర్ ప్రారంభంలో ఆయన సినిమాలకు ఆయనే యాక్షన్ సన్నివేశాలను కూడా కంపోజ్ చేసుకునే వారు. ఇప్పుడు ఆయనలోని టెక్నీషియన్ గురించి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. ఆయనలోని సాంకేతికమైన ఆసక్తి భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ సమయంలో కనిపించింది. ఇంతకీ అదేంటంటారా!.. భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ సమయంలో స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయారు. వివరాల్లోకి వెళితే, భీమ్లా నాయక్ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీకరించే సమయంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నర్రా శీను, త్రివిక్రమ్‌లను కలిసి డిస్కస్ చేసుకునే సమయంలో ఏమనిపించిందో ఏమో పవన్ కళ్యాణ్ కెమెరా చేత పట్టుకున్నారు. త్రివిక్రమ్, నర్రా శీను, రానాలను కలిపి ఓ ఫొటోను క్లిక్ మనిపించారు. ఆ సన్నివేశాన్ని మరొకరు తమ కెమెరాలో బంధించారు ఆ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. లుంగీ కట్టుకుని త్రివిక్రమ్, నర్రా శీను, రానాలను ఫొటో తీస్తున్న పవన్ కళ్యాణ్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిన చిత్రం ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యింది. సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్ సీస్‌లోనూ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. కరోనా థర్డ్ వేవ్ తర్వాత భారీ హిట్ సాధించిన చిత్రమిదే. చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. సాగర్ కె.చంద్ర దర్శకకుడు. సూర్య దేవర నాగవంశీ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు.
Comments
Post a Comment