RRRలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ రెండు సింహాల్లా ఉన్నారు : హీరో శివ కార్తికేయన్

తమిళంలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శివ కార్తికేయన్ రెమో, డాక్టర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు. మన తెలుగు వారికి కూడా ఆయన సుపరిచితుడే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడుతూ RRR సినిమాను ప్రశంసలతో ఆకాశానికెత్తేశారు. ‘‘నేను రాజమౌళిగారికి పెద్ద ఫ్యాన్. RRR సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావాలని నన్ను ఆహ్వానించగానే చాలా ఆనందమేసింది. ఎప్పుడెప్పుడు ఈవెంట్‌కు వస్తామా? అని ఎదురుచూశాను. రాజమౌళిగారు డైరెక్ట్ చేసిన మగధీర సినిమా చూడగానే ఆయనకు అభిమానిగా మారిపోయాను. ఈగ సినిమా చూసి ఓ చిన్న ఈగతోనే ఇంత పెద్ద సినిమా చేశారుగా ఇక మనలాంటి హీరోలతో ఎలాంటి సినిమాలు చేస్తారోనని అనుకున్నాను. ఆయన ఎలాంటి సినిమాలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌గారి గురించి చెప్పాలంటే ఇద్దరినీ రెండు సినిమా సింహాలైన అనుకోండి లేదా పులులైన అనుకోండి. ఇద్దరూ ఇద్దరే. RRR ట్రైలర్‌లో ఒక్కొక్కరినీ ఒక్కొక్క షాట్‌లో చూస్తుంటే గూజ్ బమ్స్ వచ్చేస్తున్నాయి. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా చూస్తున్న భావన కలుగుతుంది. ఇలాంటి భారీ సినిమాలు హిట్ అయితే థియేటర్స్‌కు ఆడియెన్స్ వస్తారు. అప్పుడు క్రమంగా జనాలు అన్ని సినిమాలకు వస్తారు. వెండితెరపై చూడాల్సిన సినిమా ఇది. కాబట్టి RRRను బిగ్ స్క్రీన్‌పైనే చూసి ఎంజాయ్ చేయండి. అదే మనం RRRకు ఇచ్చే రెస్పెక్ట్. RRR తొలిరోజు తొలి షో నేను చూస్తాను. సినిమా నన్ను అంతలా ఎగ్జయిట్‌మెంట్‌కు గురి చేసింది. సినిమా చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ మాత్రమే కాదు.. ఆడియెన్స్‌గా మనం కూడా గర్వపడే సినిమా RRR. ఎప్పుడూ హాలీవుడ్ సినిమాలు మాత్రమే చూడటం కాదు.. అక్కడి వాళ్లకు మనం ఫోన్ చేసి RRR సినిమా చూశారా? చూడండని చెప్పేలా ఉండే సినిమా ఇది. దక్షిణాది, ఉత్తరాది అని కాకుండా సినిమాను ఇండియన్ సినిమా అనే భావన వచ్చేలా చేసిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలకు మనం గౌరవం ఇవ్వాలి’’ అన్నారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి తదితరులు నటించారు. చరిత్రలో ఎన్నడూ కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని బ్రిటీష్ వారిపై తిరగబడితే ఎలా ఉంటుందనేదే RRR కథాంశం. ఇదొక ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ. 1920 బ్యాక్ డ్రాప్‌లో నడుస్తుంది. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. RRRకి సంబంధించిన ట్రైలర్, టీజర్, ప్రోమోలు అన్నీ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విడుదల చేస్తుంది.
Comments
Post a Comment