అల్లు రామలింగయ్యను అందుకే జైలులో పెట్టారు.. ఎవ్వరికీ తెలియని సీక్రెట్ రివీల్ చేసిన రామ్ చరణ్

నట వారసత్వం నేటికీ కొనసాగుతోంది. ఓ వైపు అల్లు ఫ్యామిలీ హీరోలతో పాటు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు వెండితెరపై భారీ హిట్స్ రాబడుతున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ సినిమా RRR మూవీ పూర్తి చేశారు రామ్ చరణ్. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించారు. జనవరి 7న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు. దేశంలో ప్రధాన నగరాలను చుట్టేస్తూ RRR ప్రమోషన్స్ చేస్తున్నారు రాజమౌళి అండ్ టీమ్. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తాత అల్లు రామలింగయ్య గురించిన ఓ రహస్యాన్ని బయట పెట్టారు. తన తాతయ్య స్వాతంత్ర్య సమరయోధుడని చెప్పిన చెర్రీ.. ఆ రోజుల్లో ఆయన హక్కులపై పోరాటం చేశారని, ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసని తెలిపారు. ఆ పోరాటంలో ఆయన జైలు పాలయ్యారని, 15 రోజులకు పైగా ఆయన్ని జైలులో ఉంచారని తన కుటుంబ సభ్యుల్లో కూడా కొద్ది మందికి మాత్రమే తెలుసంటూ ఓపెన్ అయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన గోండు వీరుడు కొమురం భీం, ఆంధ్రా ప్రాంతానికి చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు రోల్స్ ప్రధానంగా RRR (రౌద్రం రణం రుధిరం) మూవీ రూపొందించారు. లీడ్ రోల్స్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించగా.. ఆ ఇద్దరు హీరోల సరసన ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, శ్రీయ, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ ఎత్తున ఈ సినిమా రూపొందింది.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ