Puneeth Rajkumar Death : పునీత్ రాజ్ కుమార్‌లోని మరో కోణం.. దానాలు, సేవా కార్యక్రమాలతో కోట్ల మంది అభిమానం!

కన్నడ ఇండస్ట్రీకి చెందిన పునీత్ రాజ్ కుమార్(46) మరణ వార్తతో ఒక్కసారి సౌత్ ఇండియా ఉలిక్కి పడింది. సోషల్ మీడియాలో మీద ప్రతీ ఒక్కరూ స్పందిస్తున్నారు. భాషా బేధం లేకుండా పునీత్ గురించి ఎంతో గొప్పగా చెబుతూ సెలెబ్రిటీలు ట్వీట్లు పెడుతున్నారు. ఆయన మరణం తమకెంతో బాధ కలిగించిందని, ఎంతో మంచి మనిషి అంటూ ప్రతీఒక్కరూ చెబుతూ తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. అలా అందరి అభిమానం కేవలం నటనతోనే సంపాదించుకున్నాడా? అంటే కాదనే చెప్పాలి. కన్నడ ఆరాధ్య దైవం రాజ్ కుమార్ వారసత్వాన్ని కొనసాగిస్తూ పునీత్ రాజ్ కుమార్ తన కంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే జాతీయ అవార్డులను అందుకున్నాడు. అప్పు అంటూ పూరి జగన్నాథ్ తీసిని సినిమాతో పునీత్ రాజ్ కుమార్‌కు స్టార్డం వచ్చింది. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా, సింగర్‌గా, హోస్ట్‌గానూ పునీత్ ఫేమస్. పలు ఉత్పత్తులకు పునీత్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. సింగర్‌గా తాను సంపాదించే డబ్బంతా కూడా చారిటీలకే ఇస్తాడట. ఇక తన రెమ్యూనరేషన్‌లోంచి కూడా సేవా సంస్థలకు పెద్ద మొత్తంలోనే వెళ్తుందట. ఇప్పటికే చాలా అనాథ ఆశ్రమాలు, స్కూళ్లను నడిపిస్తున్నాడ. వెయ్యికి పైనా విద్యార్థులను చదివిస్తున్నారట. విపత్తులు సంభవించినప్పుడు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయమందిస్తూనే ఉంటారట. ఇక చనిపోయాక తన కళ్లను వేరే వాళ్లకి ఉపయోగించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారట. అలా తండ్రి బాటలతోనే తన కళ్లను కూడా దానం చేసిన అప్పుకు ఈ మాత్రం నివాళులు కురిపిస్తారు. కురిపించాల్సిందే.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ