NagaBabu - Posani: పేర్నినాని చెత్త కుప్ప, పోసానిని కుక్కతో పోల్చిన నాగబాబు... మీమ్స్, వీడియోలతో వైసీపీ నేతలకు ఘాటు రిప్లయ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్‌కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కార్యకర్త, నటుడు పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. మాటలు హద్దులు దాటేసి వ్యక్తిగత విమర్శలు చేయడమే కాదు, పోసాని ఓ అడుగు ముందుకేసి పవన్‌ను చెప్పలేని బూతు మాటలతో దూషించాడు. దీనిపై ఇప్పటికే పోసాని కృష్ణమురళిపై జనసేన కార్యకర్తలు కేసులు పెట్టారు. ఇప్పుడు పోసాని వర్సెస్ పవన్‌కళ్యాణ్ అన్నట్లు వ్యవహారం తయారైంది. సోషల్ మీడియాలో అనుకూల వ్యతిరేఖ పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి. పోసాని పవన్‌పై చేసిన విమర్శలకు బదులిస్తూ పవన్ సోదరుడు నాగబాబు ఆస్క్ మీ అంటూ ప్రజల ముందుకు వచ్చారు. మీమ్స్, వీడియో సెటైర్స్‌తో విరుచుకుపడ్డారు. అనేక ప్రశ్నలకు మీమ్స్‌తోనే సమాధానం ఇచ్చారు. ఆన్‌లైన్ టికెట్స్‌ను ప్రభుత్వం నిర్వహించడంపై అభిమానులు అడిగిన ప్రశ్నకు నాగబాబు సమాధానమిస్తూ విక్రమార్కుడు సినిమాలో రవితేజ, బ్రహ్మానందం దోచేసిన సొమ్మును పంచుకునే సందర్భంలో చిన్నప్పట్నుంచి చూస్తున్న ఎప్పుడైనా సమానంగా పంచావురా.. మోసం చేసినోడెవడు బాగుపడడురా అని బ్రహ్మానందం అంటే మనం చేసేది గుళ్లో పూజ మరి అని రవితేజ సమాధానం ఇచ్చే కామెడీ సీన్‌ను పోస్ట్ చేశారు. అలాగే పేర్ని నాని గురించి అడిగితే గుండెల్లో గోదారి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మంచు లక్ష్మిని చూస్తూ నువ్వు ఆస్కార్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందంటూ మోహన్‌బాబు పొగిడిన ప్రీ రిలీజ్ క్లిప్‌ను పోస్ట్ చేశారు మెగా బ్రదర్. పేర్నినాని ప్రపంచంలోకి అడుగు పెట్టలేమని చెత్తకుప్పలను చూపిస్తూ సమాధానం చెప్పారు. ఏపీని అమ్మేసి తనకు వైద్యం చేయించాలని కూడా అన్నారు. పోసాని కృష్ణమురళి గురించి అడిగిన ప్రశ్నకు సమరసింహారెడ్డిలో కుక్కపిల్ల మొరిగిందనుకో అని బాలకృష్ణ డైలాగ్ చెప్పే సందర్భం ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. మీరు ఏ బ్రాండ్ తాగుతారు అని అడిగిన ప్రశ్నకు ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్, గెలాక్సి, బూమ్ బూమ్ ఫొటోలను పోస్ట్ చేశారు నాగబాబు. ఇప్పుడు నాగబాబు కామెంట్స్‌కు వైసీపీ వర్గాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Comments
Post a Comment