పెళ్లి సందD 'మధురా నగరిలో' సాంగ్ రిలీజ్: దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది..

గత 25 ఏళ్ల క్రింద ‘పెళ్లి సందడి’ పేరుతో సినిమా తీసి రికార్డులు తిరగరాసిన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఇప్పుడు మోడ్రన్ ప్రేక్షకుల కోసం మోడ్రన్ ''తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రోషన్, శ్రీ లీల హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాకు గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి 'మధురా నగరిలో' అంటూ సాగిపోతున్న మరో లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. మాస్ మహారాజ్ రవితేజ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ సాంగ్ లాంచ్ చేస్తూ పెళ్లి సందD యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ''దొరక్క దొరక్క దొరికింది తళుక్కు చిలక ఇది..'' అంటూ క్లాస్ బీట్‌తో రూపొందిన ఈ పాటలో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, రాఘవేంద్రుడి మార్క్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. కీరవాణి బాణీలు పాటలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యాయి. ఆర్‌కే ఫిలిం అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్స్‌పై కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో రూపొందుతున్న ఈ మూవీకి మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న శ్రీకాంత్ తనయుడు రోషన్ కెరీర్‌కి ఈ సినిమా మంచి బూస్ట్ అవుతుందని తెలుగు ప్రేక్షక లోకం ఆశిస్తోంది.
Comments
Post a Comment