పవన్ కళ్యాణ్‌ని చెప్పుతో కొట్టగలను.. మహా అయితే చంపుతారు అంతే కదా! రాళ్లదాడి అనంతరం పోసాని రియాక్షన్

హైదరాబాద్ అమీర్ పేట్‌లోని ఎల్లారెడ్డిగూడలో ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. నిన్న (బుధవారం) అర్ధరాత్రి సమయంలో కొందరు ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. పోసానిని దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. పోసాని Vs పవన్ కళ్యాణ్ మాటల యుద్ధం నడుస్తున్న ఈ తరుణంలో పోసాని ఇంటిపై రాళ్ళ దాడి జరగడం సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ప్రస్తుతం దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ దాడిపై పోసాని రియాక్ట్ అవుతూ తన ఇంటిపై రాళ్లదాడి చేసింది పవన్‌ కళ్యాణ్ అభిమానులేనని ఆరోపించారు. ఏం జరిగినా తనకైతే ఎలాంటి భయం లేదని అన్నారు. ''నాకు నచ్చిన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు.. నేను చచ్చిపోయే వరకు జగన్ తోనే ఉంటా. గొప్ప ప్రజాసేవకుడైన జగన్ గారిని అరేయ్, ఒరేయ్ అనడం సరికాదు. పవన్ కళ్యాణ్‌వి మొదటి నుంచి సైకో బుద్ధులే. ఆయన ఎవ్వరినైనా ఏమైనా అనొచ్చు కానీ ఆయన్ను మాత్రం ఎవ్వరూ ఏమనకూడదు. తన సినిమా షూటింగుల్లో కూడా ఆవేశానికి లోనై అందరికీ కొట్టడం పవన్‌కి అలవాటు. మొదటినుంచి ఆయనది రెచ్చగొట్టే ధోరణి. ఇలాంటోడు రాజకీయాలకు పనికిరాడు. నాయకుడు ఎలా ఉంటాడో కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. నాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరితో శత్రుత్వం లేదు. నేనెప్పుడూ ఎవ్వరినీ మోసం చేయలేదు. ఇప్పుడు పవన్‌ని ప్రశ్నించాను కాబట్టి శత్రువు అయ్యాడు. నేను ఒక ఓటరుగా మాట్లాడుతున్నా. ఆయన భాషలో చెప్పాలంటే నేను ఇలాంటి సన్నాసులను చాలామందిని చూశా. ఇలాంటి దాడులు, బెదిరింపుల వల్ల మా మోరల్స్ ఎక్కడికీ పోవు. నేనింకా స్ట్రాంగ్ అవుతా. ఇలా రాళ్ల దాడులకు భయపడను. ఇలాంటి దాడులు నేను పవన్‌పై చేయలేనా? నాకు ఎవ్వడూ అక్కర్లే.. పవన్ కళ్యాణ్‌ని చెప్పుతో కొట్టగలను. మహా అయితే ఏం చేస్తారు చంపుతారు అంతే కదా. రాజకీయాలకు, నా పెళ్ళానికి ఏంటి సంబంధం.. నీకు పెళ్ళాం ఉంది. నీకు అమ్మ ఉంది.. ఇదే మాటలు నేను అంటే ఎలా ఉంటుంది'' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు పోసాని కృష్ణ మురళి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ