భార్య వియోగం ఎంతో దుర్భరం.. నటుడు ఉత్తేజ్‌ భార్య సంస్మరణ సభలో మెగాస్టార్

టాలీవుడ్ నటుడు ఉత్తేజ్‌ ఇంట కొద్ది రోజుల క్రితం తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన సతీమణి పద్మావతి ఈ నెల 13వ తేదీన క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనతో సహా ఆయన కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే పద్మావతి మరణించిన సమయంలో ఉత్తేజ్‌ను ఓదార్చేందుకు సినీ ప్రముఖులు ఎందరో తరలి వచ్చారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్లు భగవంతుడిని ప్రార్థించారు. ఇక ఉత్తేజ్‌ను తన సోదరుడిగా భావించే మెగాస్టార్ కూడా వెళ్లి.. ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. చిరంజీవిని చూడగానే.. ఉత్తేజ్ తన బాధని ఆపకోలేకపోయారు. ఆయన్ని గట్టిగా పట్టుకొని బోరున విలపించారు. ఉత్తేజ్ కుమార్తె కూడా చిరంజీవి భుజంపై వాలి పెదనాన్న పెదనాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే గురువారం (సెప్టెంబర్ 30) నాడు పద్మావతి సంస్మరణ సభ హైదరాబాద్‌లోని ఫిలిమ్ నగర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై.. పద్మావతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమెకు నివాళులు అర్పించారు. మెగాస్టార్‌ని చూడగానే ఉత్తేజ్ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి.. తన సందేశాన్ని తెలియజేశారు. అన్ని విధాలుగా జీవితంలో సెటిల్ అవుతన్న సమయంలో భార్య వియోగం అనేది చాలా దుర్భరం అని చిరంజీవి అన్నారు. పద్మావతి చనిపోవడం అందరిని కలచివేసింది అంటూ ఆయన పేర్కొన్నారు. హిట్లర్ సినిమా నుంచి ఉత్తేజ్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. నిజంగా పద్మావతి మృతి వార్త తెలిసి తాను ఎంతో చలించిపోయాను అని ఆయన అన్నారు. ఇలాంటి ఆపద వచ్చినప్పుడే.. ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ బాధ నుంచి ఉత్తేజ్ కుటుంబ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి నటులు రాజశేఖర్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్, రచయిత సుద్దాల అశోక్ తేజ, ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, నటి ఝాన్సి, హేమ తదితరులు హాజరు అయ్యారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ