Allu Arjun: అల్లు అర్జున్‌కు గన్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్యాన్.. ఆ గన్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులో ఉన్న క్రేజేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే కెరీర్ ప్రారంభం నుంచి తెలుగుతో పాటు మలయాళంలోనూ అభిమానులను సంపాదించుకున్నారు. బన్ని సినిమాలన్నీ మలయాళంలో అనువాదమవుతుంటాయి. అలా అనువాదమైన తెలుగు చిత్రాలన్నీ అక్కడ ఘన విజయాన్ని సాధించినవే. మలయాళ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలకు ఎంత క్రేజ్ ఉంటుందో తెలుగువాడైన అల్లు అర్జున్‌కు కూడా ఉందనడంలో సందేహం లేదు. ఓ సందర్భాన మలయాళ ముఖ్యమంత్రి కేరళలో జరిగే పడవ ఉత్సవాలకు అల్లు అర్జున్‌ను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించగా బన్నీ హాజరయ్యారు. మలయాళంలో ఇంత క్రేజ్ ఉన్న అల్లు అర్జున్, ఓ మలయాళ అభిమాని ఓ గన్‌ను బహుమతిగా అందించారు. అయితే సదరు అభిమాని ఇండియాలో కాకుండా,యు.ఎ.ఇలో ఈ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను అందించడం విశేషం. కొన్నాళ్లు ముందు యు.ఎ.ఇకు వెళ్లిన సంగతి తెలిసిందే. బన్నీ యు.ఎ.ఇలో ఉన్నాడనే సంగతి తెలుసుకున్న దుబాయ్‌కు చెందిన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ అక్కడకు వెళ్లి కలుసుకున్నాడు. సరే! బన్నీకి ఈ గిఫ్ట్ ఇవ్వడం వెనుక, అసలు కథేంటో తెలుసా..బన్నీకి అందించిన గిఫ్ట్ 160 సంవత్సరాల పురాతమైనది. ఈ గిఫ్ట్‌ను అందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు రియాజ్. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాను చేస్తున్నాడు. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రష్మిక మందన్న ఇందులో శ్రీవల్లి అనే పాత్రను పోషిస్తుంది. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా పుష్ప ది రైజ్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శేషాచల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Comments
Post a Comment