Pawan Kalyan: పవర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి గ్రాండ్ ట్రీట్.. అప్‌డేట్ల సునామీనే

ఆయన పేరు చెబితేనే అభిమానులు ఊగిపోతారు. ఆయన సినిమా విడుదల అయిందంటే చాలా ఆ థియేటర్‌ను పెళ్లికూతురిలా మస్తాబు చేశారు. కటౌట్లు.. దానికి పాలాభిషేకాలు చేస్తూ.. టపాసులు కాలుస్తూ నానా హంగామా సృష్టిస్తారు. ఇక ఆయన పుట్టినరోజు వచ్చిందంటే.. వాళ్లు చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఆయన పేరులో ఉన్న పవరే వేరు.. ఆయనే పవర్‌స్టార్‌స్టార్ సినిమాలు చేసినా.. రాజకీయాలు చేసినా.. ఆయనకు ఆయనే సాటి. ఆయన స్టైలే వేరు. ఈ మధ్యే పవన్ వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత పవర్‌స్టార్ పవనకళ్యాణ్ లేటెస్ట్‌గా వెండితెరపై రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిన.. ‘పింక్’ సినిమా రీమేక్‌గా రూపొందిన వకీల్‌సాబ్ సినిమాతో ఆయన మళ్లీ వెండితెరపై కనిపించారు. ఈ సినిమాలో పవన్ ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించడమే కాక.. బాక్సాఫీస్ వద్ద మరోసారి తన స్టామినాని నిరూపించుకున్నారు. ఇక ప్రస్తుతం ఆయన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్‌గా రూపొందుతున్న ‘భీమ్లా నాయక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2వ తేదీన పవర్‌స్టార్ పుట్టినరోజు రానుంది. ఇక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాల నుంచి అప్‌డేట్ల సునామీ రానుంది. అందులో ప్రధానంగా ‘భీమ్లా నాయక్’ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ ఒకటి కాగా.. ఆయన క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న ‘’ సినిమా నుంచి కూడా అప్‌డేట్ వస్తుందని టాక్ వినిపిస్తోంది. దీంతో పాటు ‘గబ్బర్‌సింగ్’ సినిమాతో పవన్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ కూడా పవన్ బర్త్‌డే రోజున విడుదల అవుతుందని తెలుస్తోంది. దీంతో సెప్టెంబర్ 2వ తేదీన పవన్ అభిమానులకు పండుగ వాతావరణం రానుంది.
Comments
Post a Comment