HBD Nagarjuna : పొలం కొనమని చెబితే అలా అన్నారు.. నాగార్జునపై బండ్ల గణేష్ కామెంట్

టాలీవుడ్ కింగ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయింది. నాగ్ పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్‌లో టాలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ మధ్య ట్విట్టర్ స్పేస్ అంటూ స్టార్‌ల బర్త్ డేలకు సెలెబ్రిటీలు ముచ్చట్లు పెడుతున్నారు. తమకు ఆ హీరోతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాజాగా నాగార్జున బర్త్ డే సందర్భంగా కోన వెంకట్, బీవీఎస్ రవి, , చందూ మొండేటి, బ్రహ్మాజీ వంటివారు ముచ్చట్లు పెట్టారు. తమకు నాగార్జునతో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. తాను నాగార్జునకు వీరాభిమానిని అని, ప్రతీ సినిమా గురించి పూసగుచ్చినట్టు వివరించారు బీవీఎస్ రవి. ఎప్పుడూ కూడా నాగార్జున చుట్టూ నెగెటివిటీ అనేది ఉండనే ఉండదు.. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ ఉంటూనే ఉంటారు అని కోన వెంకట్ చెప్పుకొచ్చారు. ఇక బండ్ల గణేష్ లైన్‌లోకి వచ్చారు. నాగార్జునతో ఉన్న అనుబంధం గురించి బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. డాన్ సినిమా సందర్భంలో ఓ సారి నాగార్జున గారిని పొలం కొనమని, షాద్ నగర్‌లో రేట్లు బాగున్నాయని బండ్ల గణేష్ సలహా ఇచ్చారట. అయితే దానికి నాగార్జున ఇచ్చిన సమాధానం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నాకు ఇప్పుడు 40 ఏళ్లు దాటాయ్.. ఇక వాటిని కొనుక్కుని సాగులోకి తెచ్చే సరికి 60 ఏళ్లు వస్తాయ్.. అవి నాకు అవసరమా?.. అని నాగార్జున అన్నారట. నాగార్జున గారు ఎప్పుడు ఎలా బతకాలో ముందే నిర్ణయించుకున్నారు. 40 ఏళ్లలో ఎలా బతకాలి.. 50 ఏళ్లకు ఎలా బతకాలి.. 60 ఏళ్లకు ఎలా బతకాలి ఇలా ముందే నిర్ణయించుకున్నారు.. ఆయన జీవితాన్ని ముందే డైరీలో రాసుకున్నారు అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. ఇక బండ్ల గణేష్, బ్రహ్మాజీ, కోన వెంకట్, బీవీఎస్ రవి ఇలా అందరూ కూడా ఎన్నో విషయాలను పంచుకున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ