ఈడీ కార్యాలయానికి బండ్ల గణేష్.. వక్క పొడి కూడా వేసుకోను.. నోటీసులెందుకు ఇస్తారంటూ నిర్మాత ఫైర్

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నేడు కీలక మలుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసులకు అనుగుణంగా దర్శకుడు విచారణకు హాజరయ్యారు. ఇక నేటి నుంచి వంతుల వారిగా ఒక్కోసెలెబ్రిటీ విచారణకు హాజరు అవుతుంటారు. ఈ తంతు సెప్టెంబర్ 22 వరకు కొనసాగుతూ ఉంటుంది. అయితే మొదటి రోజు పూరి జగన్నాథ్ వంతు వచ్చింది. పూరి జగన్నాథ్‌ను ఈడీ పలు రకాలుగా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. 2015 నుంచి బ్యాంక్ లావాదేవీలను ఈడీ అడిగినట్టు.. పూరి జగన్నాథ్ వాటిని సమర్పించినట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఓ వైపు కొనసాగుతుంటే.. ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి నిర్మాత బండ్ల గణేష్ వచ్చారు. బండ్ల గణేష్ రాకతో అతని పాత్రపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈడీ కార్యాలయానికి చేరుకున్న బండ్ల గణేష్.. అక్కడికా రావడంపైనా క్లారిటీ ఇచ్చారు. నాకు ఎవరు నోటీసులు ఇవ్వలేదు. పూరీ జగన్నాథ్ కోసం ఇక్కడికి వచ్చాను. నాకెందుకు నోటీసులు ఇస్తారు అంటూ అక్కడి మీడియాతో బండ్ల గణేష్ మాట్లాడారు. ఇక తాజాగా ఆయన ట్వీట్ కూడా వేశారు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాకు ఏ విధమైన సంబంధం లేదు నేను పూరి గారికి మద్దతుగా మాత్రమే వచ్చాను అంటూ క్లారిటీ ఇచ్చారు. పూరి జగన్నాథ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఇద్దరమ్మాయిలు సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీల గురించి ప్రశ్నిస్తున్న సమయంలో పూరీ జగన్నాథ్‌... నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేశ్‌ పేరును ప్రస్తావించినట్లు, దీంతో గణేష్‌ను అధికారులు కార్యాలయానికి రప్పించారనే వార్తలు వచ్చాయి. వాటిపై బండ్ల గణేష్ స్పందిస్తూ.. వాటిని ఖండించారు. నేను వక్క పొడి కూడా వేసుకోను.. నాకు ఎందుకు నోటీసులు ఇస్తారు.. నా స్నేహితుడు పూరిని కలిసేందుకు మాత్రమే వచ్చాను అని బండ్ల గణేష్ క్లారిటీగా చెప్పారు. ధర్మో రక్షితి రక్షిత: అంటూ కొటేషన్స్ కూడా పెడుతున్నాడు.. డ్రగ్స్ కేసులో తన పేరును లాగకండని.. కేవలం తన స్నేహితుడు పూరిని కలిసేందుకు వచ్చాను.. తమది ముప్పై ఏళ్ల బంధమని బండ్ల గణేష్ వివరణ ఇచ్చుకున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ