‘వరుడు కావలెను’ అంటూ వచ్చేది ఆ రోజే.. లేటెస్ట్ అప్‌డేట్ ఇచ్చిన చిత్ర యూనిట్..

విభిన్నమైన సినిమాలు చేయడంలో యంగ్ హీరో ఎప్పుడూ ముందుంటారు. ఒక సినిమాకు, మరో సినిమాకు కచ్చితమైన భిన్నత్వాన్ని ఆయన చూపిస్తూ ఉంటారు. అలా వినోదం మాత్రమే కాదు.. మంచి సందేశం ఉన్న సినిమాలు చేస్తుంటారు నాగశౌర్య. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలు ‘లక్ష్య’, ‘వరుడు కావలెను’. లక్ష్య స్పోర్ట్స్ డ్రామా కాగా.. ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. లక్ష్యలో ఆయన మాజీ ఆర్చరీ ప్లేయర్‌గా కనిపించనున్నారు. ఇక వరుడు కావలెను సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల అయింది. మొన్నటి వరకు వరుడు కావలెను సినిమా ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది. ‘దిగు దిగు నాగ’ అంటూ వదిలిన ఈ సాంగ్ కాంట్రవర్సీగా మారింది. భక్తి గీతాన్ని తీసుకొచ్చి ఇలా ఐటం పాటగా మార్చడంపై నెటిజన్లు భగ్గుమన్నారు. రాసిన అనంత్ శ్రీరామ్, కొట్టిన తమన్, కుప్పి గంతులు వేయించిన శేఖర్ మాస్టర్‌ను అందరూ ఏకిపారేశారు. అంత జరుగుతున్నా కూడా చిత్రయూనిట్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంది. అయితే ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. సినిమా టీజర్‌ను ఎప్పుడు విడుదల చేస్తున్నారనే విషయాన్ని వెల్లడించింది చిత్ర యూనిట్. ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 31వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక సినిమా ఇతర వివరాల విషయానికొస్తే.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం వంశి పచ్చి పులుసు, సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ