Bheemla Nayak First Single : రచ్చ మొదలయ్యేది ఆరోజే!

పవర్ స్టార్ అభిమానులు ఇప్పుడు అసలైన పండుగను సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డేను గ్రాండ్ లెవెల్‌లో ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సినిమా అప్డేట్లతో సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోయేలా ఉంది. అసలే భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు అప్డేట్లు రెడీగా ఉన్నాయి. ఇక హరీష్ శంకర్ మూవీ అప్డేట్ కూడా రాబోతోందనే టాక్ వినిపిస్తోంది. ఆ విషయం కాసేపు పక్కన బెడితే తాజాగా ఓ అప్డేట్ వచ్చేసింది. నుంచి చిత్రయూనిట్ అదిరిపోయే వార్త ఒకటి చెప్పేసింది. ఇప్పటికే వదిలిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ ఫీవర్ ఇంకా వదల్లేదు. గల గల భీమ్లా అంటూ జనాల చెవుల్లో ఇంకా వినిపిస్తూనే ఉంది. అలా తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. అప్పటి నుంచి భీమ్లా నాయక్ ఫస్ట్ సింగిల్ గురించి అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోందన్న సంగతిని తమన్ ఇది వరకే రివీల్ చేసేశారు. కానీ తాజాగా ఆ ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేశారు. ఏ సమయానికి పాట రాబోతోందనే తాజాగా ప్రకటించారు. సెప్టెంబర్ 2న ఉదయం పదకొండు గంటల 16 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్, ఆ గన్ను పట్టుకున్న తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక సెప్టెంబర్ 2న పవర్ స్టార్ అభిమానులకు పూనకాలు రావాల్సిందే అన్నట్టుగా ఫస్ట్ సింగిల్ ఉండబోతోందట.
Thanks for the information about the details
ReplyDeleteSarkaru Vaari Paata Movie Review
RRR Movie Review
Bheemla Nayak Movie Review