Aamani అలా ఇంద్రజ ఇలా.. చిన్నప్పటి నుంచి అదే పిచ్చి!

ఆమని, ఇంద్రజలు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన కాలం గురించి అందరికీ తెలిసిందే. ఈవీవీ, బాపు, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి దిగ్గజ దర్శకుల చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్లుగా మారిపోయారు. , ఇంద్రజలు కలిసి దాదాపు మూడు నాలుగు సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇండస్ట్రీకి వచ్చాక తామిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని చెబుతూ.. ఎన్నో పర్సనల్ విషయాలను పంచుకున్నారు. తాజాగా ఈ ఇద్దరూ ఆలీతో సరదాగా షోలో తమ సినీ, పర్సనల్ జీవితం గురించి నోరు విప్పారు. ‘నాకు చిన్నప్పటి నుంచి చదువంటే పిచ్చి.. చదువుకుంటాను అంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నాకు ఇప్పటికే అది తలుచుకుంటే బాధగా ఉంటుంది. నాకు ఇద్దరు చెల్లెళ్లు. నాకు ఒక అన్నయ్య, తమ్ముడు ఉంటే బాధ్యతలు వారు చూసుకుంటూ నన్ను చదువుకొనిచ్చే వారేమోనని ఫీలవుతుంటాను. నేను చదువుల్లో ఫస్ట్. స్కూల్లో ఫస్ట్ వచ్చేదాన్ని. ఒకవేళ సినిమాల్లోకి రాకపోయి ఉంటే.. జర్నలిస్ట్ అయినా అయి ఉండేదాన్ని, లేదా సైంటిస్ట్ అయినా అయి ఉండేదాన్ని’ అంటూ తనకు చదువుల మీద ఉన్న పిచ్చిన చెప్పుకొచ్చారు. ఇంద్రజ చెప్పిన దానికి వ్యతిరేకంగా ఆమని చెప్పుకొచ్చారు. ‘నాకు చదువులు అంటే అంతగా పడవు. మీడియం స్టూడెంట్‌ను. ఇంద్రజ అంతగా చదివేదాన్ని కాదు. స్కూల్ ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసేదాన్ని. స్కూల్‌కు వెళ్లినా కూడా సినిమా మీద ధ్యాస ఉండేది. జయసుధ, జయప్రద, శ్రీదేవీ ఇలా అందరి సినిమాలు చూసేదాన్ని. సినిమాలంటే అంతగా పిచ్చి’ అంటూ ఆమని తన గురించి తెలిపారు.
Comments
Post a Comment