15 నిమిషాల సుఖం కోసం అలా చేయలేను!.. కదిలించేలా రేణూ దేశాయ్ పోస్ట్

ప్రస్తుతం చాలా మంది శాకాహారులుగా మారిపోతోన్నారు. జీవ హింసకు వ్యతిరేకంగా, మూగ జీవుల హక్కులను గుర్తిస్తూ, వాటిపై అవగాహన తెచ్చుకుని కొంత మంది మాంసాహారాన్ని వదిలేస్తున్నారు. అయితే ఇందులో చాలా మంది వేగన్‌గా మారిపోవడానికి రకరకాల కారణాలుంటాయి. ఆ మధ్య ఆహా భోజనంబు షోలో ఆలీ గెస్టుగా వచ్చారు. తన భార్య మటన్ తినడం మానేసిందని దాని వెనుకున్న కథను చెప్పుకొచ్చారు. ఓ సారి మేకను ముక్కలు ముక్కలుగా కట్ చేయడం చూసిందని అప్పటి నుంచి మటన్ తినడం పూర్తిగా మానేసందని చెప్పుకొచ్చారు. అలా ఒక్కొక్కరు ఒక్కో సందర్భంలో రియలైజ్ అవుతుంటారు. అయితే కూడా వేగన్‌గా మారిపోయారట. చాలా మంది సెలెబ్రిటీలు ఇప్పుడు పూర్తిగా శాకాహారులుగా మారిపోయారు. ఇక రేణూ దేశాయ్ తాజాగా ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. జంతు పరిరక్షణకు సంబంధించిన ఓ సంస్థ చేసిన పోస్ట్‌ను రేణూ దేశాయ్ తిరిగి షేర్ చేశారు. అలా తన అభిప్రాయాన్ని కూడా చెప్పకనే చెప్పేశారు. నేను వేగన్‌గా ఎందుకు మారిపోయాను?.. ఎందుకంటే.. ఓ జంతువు జీవితకాలం మొత్తాన్ని, దాని భయం, దాని బాధ, నొప్పి ఇవన్నీ కూడా కేవలం నా పదిహేను నిమిషాల సుఖం, సంతోషానికి సరితూగదు అని తెలుసుకున్నాను. ఆ విషయాన్ని నేను రియలైజ్ అయ్యాను. అంటూ ఆ పోస్ట్ సారాంశాన్ని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు. మన కడుపు నిండి పదిహేను నిమిషాలు ఆనందంగా ఉండేందుకు ఓ జంతువు ప్రాణాన్ని తీసేస్తున్నాం.. అది నచ్చకే వేగన్‌గా మారిపోయాను అని రేణూ దేశాయ్ పరోక్షంగా చెప్పేశారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ