Samapath Nandi : మరిచిపోలేని రోజు.. దేవుడిని కలిశాను.. చిరుపై ‘రచ్చ’ డైరెక్టర్ కామెంట్స్

టాలీవుడ్ డైరెక్టర్ గురించి, ఆయన మేకింగ్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి సినిమా ఏమైంది ఈవేళతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోలను ఆశ్చర్యపరిచారు. అలా రెండో చాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సంపత్ నందికి దక్కింది. వచ్చిన అవకాశాన్ని సంపత్ నంది ఉపయోగించుకుని రచ్చ వంటి మాస్ మసాలా కమర్షియల్ సినిమాను తెరకెక్కించాడు. అలా సంపత్ నంది మెగా హీరోకు హిట్టిచ్చారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌తోనూ ఓ చాన్స్ వచ్చిందన, ఆయన కోసం చాలా ఏళ్లు ఎదురుచూశాడన్న సంగతి తెలిసిందే. ఇక సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్, గౌతమ్ నందా పర్వాలేదనిపించాయి. ఇప్పుడు సంపత్ నంది నిర్మాతగా, దర్శకుడిగా బిజీగా ఉన్నారు. గోపీచంద్ తమన్నా కాంబినేషన్‌లో రాబోతోన్న సీటీమార్ సినిమాను సంపత్ నంది రెడీ చేశాడు. మామూలుగా అయితే ఈ సమ్మర్‌లోనే రావాల్సింది. కానీ కరోనా వల్ల అంతా తారుమారైంది. ఇప్పుడు సంపత్ నంది కలిశారు. తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కలిశాడా? లేదా? మరేతర కారణంతో కలిశాడో తెలియడం లేదు గానీ ఆయన చేసిన కామెంట్లు మాత్రం వైరల్ అవుతున్నాయి. చిరుతో దిగిన సెల్ఫీని షేర్ చేసిన సంపత్ నంది.. నా జీవితంలో మరో మరిచిపోలేని అద్భుతమైన రోజు. మన దేవుడు చిరంజీవి గారిని కలిశాను. ఎంతో విలువైన సమయాన్ని నాకు ఇచ్చారు. ఇంకా ఎన్నో గొప్ప సంగతులను వివరించారు. చర్చించారు. మున్ముందు అంతా మంచి జరగాలని ఆశీర్వదించారు అని సంపత్ నంది తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక ఈ పోస్ట్ మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చిరంజీవితో సినిమా చాన్స్ వచ్చిందా? అని కొందరు అడిగేస్తున్నారు.
Comments
Post a Comment