MAA Elections: ‘మా’ని చెడగొడుతున్న చీడపురుగులు.. షాకింగ్ కామెంట్స్ చేసిన బాబు మోహన్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్‌లో కొన్ని చీడ పురుగులు చేరి చెడగొడుతున్నాయని అన్నారు నటుడు . టాలీవుడ్‌లో వివాదాస్పదంగా మారిన MAA ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ ఇష్యూపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ‘మా’ అంటే మా కుటుంబం అని ఇందులో జరిగే వాటిని ఎన్నికలుగా చూడమని చెప్పిన ఆయన.. కావాలనే కొంతమంది ‘మా’ని వివాదం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికలు జరగడానికి ఇంకా టైం ఉంది.. నోటిఫికేషన్ కూడా రాలేదు. ఈ ఎన్నికలు పదిరోజుల హడావిడి మాత్రమే. అయితే ఆ మధ్య ‘మా’ అనేది బాగా వివాదం అవుతుంది. అది కొందరివల్ల మాత్రమే. చెడగొట్టే ఛీడపురుగులు అన్ని చోట్లా ఉంటాయి. అన్ని వృత్తులలోనూ ఈ ఛీడ పురుగులు ఉంటాయి.. అలాగే ‘మా’ వృత్తికి కూడా దాపరించింది. ‘మా’ ఎలక్షన్స్ జరగాల్సిందే అని అంటున్నారు.. దీన్ని మేం ఎలక్షన్స్‌లా భావించం. మా ఇంటి ఎన్నికలుగా మాత్రమే చూస్తాం.. మా బ్రదర్‌కి మా సిస్టర్‌కి ఓటు వేస్తున్నాం అని మాత్రమే అనుకుంటాం. మా అనేది ఒక ఫ్యామిలీ. పొలిటికల్ స్టంట్లు ఏమీ ఉండవు. కానీ ఈ మధ్య కొంతమంది ‘మా’లోకి దూరి చెడగొట్టడానికి ట్రై చేస్తున్నారు. చిరంజీవి, దాసరి లాంటి పెద్దలు ‘మా’ చెడగొట్టకుండా కాపాడారు. కానీ చీడ పురుగు తన ప్రయత్నాన్ని మాత్రం ఆపడం లేదు.. చెడగొట్టడానికే ట్రై చేస్తుంది. ప్రకాష్ రాజ్‌ని చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారనే విషయం నాకు తెలియదు’ అని అన్నారు బాబూ మోహన్.
Comments
Post a Comment