HBD Sonu Sood: రియల్ హీరోకి అభినందనల వెల్లువ.. గ్రాండ్ ట్రీట్ ఇచ్చిన ‘ఆచార్య’ యూనిట్

‘ఆపద్భాంధవుడు’ అంటే ఇప్పుడు అందరికీ గుర్తుకు వచ్చేది ఒకే ఒక పేరు.. అదే . కరోనా లాక్‌డౌన్‌లో సమయంలో కష్టాల్లో ఉన్న ఎందరో వలస కార్మికులు, నిరుపేదలకు ఆయన అండగా నిలిచారు. తమ స్వస్థలాలకు చేరుకోలే ఇబ్బందులు పడుతున్న ఎందరినో ఆయన తన సొంత ఖర్చుతో స్వస్థలాలకు చేర్చారు. కొద్ది రోజుల క్రితం వరకూ రెండో దశలోనూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేశారు. ప్రధానంగా ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఆయన, తన ఫౌండేషన్ తరఫున ఆక్సిజన్ ప్లాంటులను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు.. దేశవ్యాప్తంగా పలు ప్రధాన రాష్ట్రాల్లో ఈ ప్లాంటులను ఏర్పాటు చేశారు సోనూ. ఈ క్రమంలో గత ఏడాది నుంచి సోనూసూద్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని.. అభిమానులు కూడా అదే దారిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోనూసూద్ పేరిట కొన్ని ఫౌండేషన్లు ఏర్పాటు చేసి.. ఎందరికో సహాయం చేస్తున్నారు. కాగా, నేడు (జూలై 30) సోనూసూద్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రియల్ హీరోకి విషెస్ చెబుతూ అభిమానులు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. అయితే ఆయన నటిస్తున్న ‘ఆచార్య’ చిత్ర యూనిట్ కూడా ఆయనకు పుట్టినరోజు సందర్భంగా ట్రీట్ ఇచ్చింది. సినిమాలో ఆయన లుక్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘బంగారం వంటి మనస్సు ఉన్న.. విలక్షణ నటుడు సోనూసూద్‌కు చిత్ర యూనిట్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ యూనిట్ పేర్కొంది. ఇక మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్న రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్లుగా చేస్తున్నారు.
Comments
Post a Comment