Devineni Uma: దేవినేని ఉమక్క చిప్పకూడు తింటుందే.. చెలరేగిన రోజా.. సంచలన వ్యాఖ్యలు

అరెస్ట్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్ అవుతుంది. కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమమైనింగ్ చేస్తున్నారని తన అనుచరులతో కలసి నిరసన చేపట్టారు ఉమ. ఈ సమయంలో తెలుగుదేశం, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుని రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో పలువురికి గాయాలు కాగా.. దేవినేన ఉమ ఉద్దేశ పూర్వకంగానే జి. కొండూరులో అలజడి సృష్టించారని ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు పెట్టి జైలుకి పంపారు పోలీసులు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే.. సినీ నటి స్పందిస్తూ.. దేవినేని ఉమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమక్క జైల్లో చిప్పకూడు తింటుంది అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ.. ‘పేదల ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలాలు సేకరిస్తుంటే.. ల్యాండ్ మాఫియా అని తెలుగుదేశం పార్టీ వాళ్లు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈరోజు అక్కడ మహిళలు ఇల్లులు కట్టుకుంటుంటే.. అక్కడ ఎవరూ ఇల్లు నిర్మించుకోవడం లేదు.. కేవలం మైనింగ్ మాత్రమే జరుగుతుందని దేవినేని ఉమక్క అక్కడకు వెళ్లి తెగ హడావిడి చేసి జైలుపాలయ్యాడు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డిగారు చేస్తున్న అభివృద్ధి చూసి సహించలేని తెలుగుదేశం పార్టీ వాళ్లు కడుపు మంటతో ఇలాంటి పనులు చేస్తున్నారు. దేవినేని ఉమలాంటి వారు.. అక్కడకు వెళ్లి వైసీపీ నాయకుల మీద రాళ్లు వేయడం.. కర్రలతో కొట్టి అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. అందుకే ఈరోజున ఉమ జైలుకి వెళ్లి చిప్పకూడు తినే పరిస్థితి వచ్చింది అంటూ ఘాటూ వ్యాఖ్యలు చేశారు రోజా. అయితే గతంలో కూడా ఉమని ఉద్దేశించి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా నేపథ్యంలో ఏపీ సీఎం విఫలం అయ్యారని.. చేతులెత్తేశాం అని ప్రభుత్వం ఒప్పుకుంటే చంద్రబాబు వచ్చి మొత్తం సెట్ చేసేస్తారని దేవినేని ఉమ కామెంట్స్ చేయడంతో వాటికి కౌంటర్ ఇచ్చారు రోజా. ‘ఆయనొచ్చి ఏం చేస్తాడన్నది తరువాత.. ముందు ఈ సిగ్గులేని మాజీ మంత్రి ఆడా మగో తెలియక కేసీఆర్ అడిగాడు.. ముందు ఆ టెస్ట్‌లు చేయించండి’ అంటూ అప్పట్లో షాకింగ్ కామెంట్స్ చేశారు రోజా. ఇలా సమయం వచ్చిన ప్రతిసారి మాజీ మంత్రికి తనదైన శైలిలో గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు రోజా.
Comments
Post a Comment