Chiranjeevi : జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా.. అల్లు రామలింగయ్యపై చిరు కామెంట్స్

తెలుగు వారికి పేరును పరిచయం చేయనక్కర్లేదు. నాటి తరం నేటి తరం అని తేడా లేకుండా ప్రతీ ఒక్క తెలుగు వ్యక్తికి ఆయన పేరు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా సినీ అభిమానులకు ఆయన ఎప్పుడూ ప్రత్యేకమే. ఆయన వేసిన పాత్రలు, తరతరాలను నవ్వించిన తీరు ఎప్పటికీ చిరస్మరణీయమే. ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి.. దాదాపు మూడు నాలుగు జనరేషన్స్ అంటే సునీల్ వంటి వారితోనూ కలిసి కామెడీని పండించారు. చివరగా కళ్యాణ రాముడు చిత్రంలోనూ అందరినీ నవ్వించేశారు. అల్లు రామలింగయ్య 2004లో జూలై 31న తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఇక నేడు ఆయన వర్దంతి. ఈ క్రమంలో అల్లు, మెగా ఫ్యామిలీలే కాకుండా ఇతర సెలెబ్రిటీలు సైతం ఆ మహనీయుడిని తలుచుకుంటున్నారు. ఈ క్రమంలో మెగా స్టార్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘శ్రీ అల్లు రామలింగయ్య గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన నేర్పిన జీవితసత్యాలు ఎప్పటికీ మార్గదర్శకంగా వుంటాయి.ఒక డాక్టర్ గా,యాక్టర్ గా, ఫిలాసఫర్ గా,ఓ అద్భుతమైన మనిషిగా,నాకు మావయ్య గా ఆయన ఎల్లప్పుడూ మా స్మృతుల్లో ఉంటారు.ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలు మరోసారి నెమరువేసుకుంటూ’ అని చెప్పుకొచ్చారు. ఇక మరో వైపు బండ్ల గణేష్ కూడా అల్లు రామలింగయ్య వర్దంతి గురించి పోస్ట్ చేశారు. అల్లు వారి ముద్రను ఇండస్ట్రీపై బలంగా వేయాలని అరవింద్, బన్నీ బాగానే కష్టపడుతున్న సంగతి తెలిసిందే. అందుకే అల్లు స్టూడియోను కూడా ప్రారంభించేశారు. గత ఏడాది అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా స్టూడియో పనులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Comments
Post a Comment