టుడే ఇన్‌స్టా హిట్స్: రుహాని గ్లామర్ హీట్.. రష్మి స్టైలింగ్ ట్రీట్.. వర్రీ కావొద్దంటున్న లావణ్య

వేడెక్కిస్తున్న రుహానీ గ్లామర్ హీట్ ‘చి.ల.సౌ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి . ఆ తర్వాత ‘హిట్’, ‘డర్టీ హరీ’ వంటి సినిమాల్లో ఆమె నటించి ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు రాకపోయినా.. సోషల్‌మీడియా ద్వారా అమె ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. తాజాగా తన అందాలను చూపిస్తూ.. ఓ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది రుహానీ. నీరసంగా ఉంటూనే.. ప్రకాశం అంటే ఇదే అంటున్న మడోనా ‘ప్రేమమ్’ సినిమాతో మంచి హిట్ అందుకొని.. ఆ తర్వాత మలయాళం సినిమాలతో బిజీ అయిపోయింది హీరోయిన్ . మంచి అభినయంతో.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆమె చేరువ అయింది. ప్రస్తుతం నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటిస్తోంది. తాజాగా చాలా నీరసంగా కనిపిస్తూ.. కొన్ని పిక్స్‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది మడోనా.. వీటిని తన తల్లి తీసింది అంటూ ఆమె క్యాప్షన్ పెట్టింది. ‘ఎక్స్‌ట్రా’గా నవ్వులు చిందిస్తున్న రష్మి నటిగా ఎన్నో సినిమాలు చేసిన రాని గుర్తింపు ఒకే ఒక టీవీ షోతో సంపాదించుకుంది రష్మి. ‘జబర్ధస్త్’ షోతో యాంకర్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ భామ. ఆ తర్వాత పలు టీవీ షోలతో పాటు సినిమాల్లో అవకాశాలు కూడా సంపాదించుకుంది. అయినప్పటికీ.. తనను వెలుగులోకి తీసుకువచ్చిన యాంకరింగ్‌ను మాత్రం ఆమె వదలడం లేదు. ఇక ఈ అమ్మడి ఫోటోషూట్‌లు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా చీరలో, నవ్వులు చిందిస్తూ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. తుపాకీ చేపట్టిన గ్యాంగ్‌స్టర్‌గా సన్నీ యాక్షన్ బాలీవుడ్ హాట్ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓ పాపులర్ రియాల్టీ షోతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక సోషల్‌మీడియాలో సన్నీ చేసే హంగామా మామూలుగా ఉండదు. తాజాగా కొందరు అబ్బాయిలతో కలిసి గన్ పట్టుకొని.. ఓ గ్యాంగ్‌స్టర్‌లా బిల్డప్ ఇస్తూ ఓ వీడియోని నెటిజన్లతో షేర్ చేసింది సన్నీ. బీచ్ ఒడ్డున లావణ్య.. వర్రీ కావొద్దంటూ.. అందాల రాక్షసి సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె సినిమా విశేషాలతో పాటు.. తరచూ ఫోటోషూట్‌లు చేస్తూ వాటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేస్తుంది. తాజాగా బీచ్ ఒడ్డున నిలబడి దిగిన కొన్ని పిక్స్‌ని అభిమానులతో పంచుకుంది. దీనికి ‘డోంట్ వర్రీ.. బీచ్ హ్యాపీ’ అంటూ ఆమె క్యాప్షన్ పెట్టింది.
Comments
Post a Comment