ఆయనే మా అందరికి ఆదర్శం.. తన తాత ‘రామలింగయ్య’కి అల్లు అర్జున్ నివాళి

తెలుగు కమెడియన్లలో ఆయనదో ప్రత్యేకమైన స్థానం. ఆయన చేసిన కామెడి.. ఆయన బాడీ లాంగ్వేజీని మరెవరూ భర్తీ చేయలేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ‘ముత్యాలు.. వస్తావా..’ అంటూ పాడినా.. దానికి స్పూఫ్‌గా ‘రంజు భలే రామ్ చిలకా’ అనే పాటలో హీరోయిన్‌తో చిందులు వేయాలన్నా ఆయనకు ఆయనే సాటి.. ఆయన పద్మశ్రీ . ఎన్నో చిత్రాల్లో ఆయన నటనతో ప్రేక్షకులను రాయలింగయ్య అలరించారు. తనదైన విలక్షణమైన కామెడీతో ఆయన ప్రేక్షకుల మదిలో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. ‘పుట్టిల్లు’ అనే సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించిన ఆయన.. దాదాపు ఐదు దశాబ్ధాలపాటు తెలుగు ప్రేక్షకులకు హాస్యం పంచారు. హాస్యం మాత్రమే కాదు.. సెంటిమెంట్ సీన్లలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. వృత్తిరీత్య హోమియోపతి డాక్టర్ అయిన ఆయన స్వతంత్ర సమరంలోనూ పాల్గొని జైలుకు వెళ్లారు. ఇక తెలుగు చలనచిత్రానికి ఆయన అందించన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ, రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డులను ప్రధానం చేసింది. నేడు (జూలై 31) అల్లు రామలింగయ్య వర్థంతి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, కుటుంబసభ్యలు ఆయన్ని గుర్తు చేసుకుంటూ సోషల్‌మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆయన మనవడు, తాజాగా ఐకాన్ స్టార్‌గా మారిన తన తాతని తలచుకుంటూ ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ‘ఓ రైతు, ప్రఖ్యాత నటుడు, అంతకు మించి మంచి మనస్సున్న వ్యక్తి మా తాతగారు.. ఆయన వర్థంతి రోజున ఆయన్ని ఓసారి స్మరించుకుంటున్నాను. మీకు సినిమా మీద ఉన్న అభిలాషే మా అందరికీ వచ్చింది. మా అందరికి ఆదర్శంగా నిలుస్తూ.. మీ ప్రయాణం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఎప్పటికీ మా గుండెల్లోనే నిలిచిపోతారు’. అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ