నాన్న కోరిక అది.. వాళ్ళు చనిపోయాక 7 రోజుల పాటు! వరుస విషాదాలపై నోరువిప్పిన రాజీవ్ కనకాల

తెలుగు చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజీవ్ కనకాల. సినిమా ఏదైనా, అందులో తన క్యారెక్టర్ ఎలాంటిదైనా ఇట్టే ఒదిగిపోయే ఎన్నో హిట్ సినిమాల్లో భాగమయ్యారు. అయితే రాజీవ్ ఇంట్లో ఆయన తల్లి, తండ్రి, చెల్లి వరుస మరణాలు తీవ్ర విషాదం నింపాయి. ముందు తల్లి లక్ష్మి కనకాల, ఆ తర్వాత తండ్రి దేవదాస్ కనకాల, ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయటపడక ముందే సిస్టర్ శ్రీ లక్ష్మి మరణాలు రాజీవ్ కుటుంబాన్ని కుదిపేశాయి. తాజా ఇంటర్వ్యూలో ఈ విషాద ఘటనలపై ఓపెన్ అయ్యారు రాజీవ్ కనకాల. మీ నాన్న గారికి ఓ డ్రీమ్ ఉండేదటగా అని యాంకర్ అడిగిన ప్రశ్నపై స్పందించిన రాజీవ్.. నాన్న డైరెక్ట్ చేయమని ఫోర్స్ చేయడంతో ఓ సారి పైలెట్ ఎపిసోడ్ డైరెక్షన్ చేశానని చెప్పారు. నాన్న డైరెక్షన్ చేయాల్సిన సీన్లు తనతో చేయించారని తెలిపారు. అలా దూరదర్శన్‌లో వచ్చే ప్రోగ్రాం కోసం చాలా ఎపిసోడ్స్ డైరెక్షన్ చేశానని అన్నారు. ఆ తర్వాత తన కుటుంబంలో జరిగిన వరుస విషాదాలపై ఆయన రియాక్ట్ అయ్యారు. తన తల్లి 2018లో మరణించారని, ఆ తర్వాత ఏడాదిన్నరకు తన తండ్రి కూడా కన్నుమూశారని తెలిపారు రాజీవ్ కనకాల. సోఫాలో కూర్చొని అలాగే కిందపడటంతో ఆయనకు ఫ్యాక్చర్ అయిందని, ఆసుపత్రిలో జాయిన్ చేసి బెటర్ ట్రీట్‌మెంట్ ఇచ్చినా ప్రయోజనం లేదని అన్నారు. అనారోగ్యంతో చివరకు ఆగస్టు 2న తన తండ్రి మరణించారని, ఆయనకు ఎవరితో చేయించుకోవడం ఇష్టం లేదేమో అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు రాజీవ్. ఆ తర్వాత సిస్టర్ మరణం గురించి కూడా వివరణ ఇచ్చారు రాజీవ్ కనకాల. తన చెల్లికి చాలా రోజుల నుంచే క్యాన్సర్ ఉందని, అయితే ఆమె ఎవ్వరికీ చెప్పుకోలేదని, అందరికీ తెలిసే సమయానికి ఆ క్యాన్సర్ 4th స్టేజ్‌కి వెళ్లిందని అన్నారు. అప్పటినుంచి ప్రతి ఆరు నెలలకోసారి ట్రీట్‌మెంట్ తీసుకుంది కానీ చివరకు అదే క్యాన్సర్‌తో కన్నుమూసిందని తెలిపారు. అప్పటినుంచి 7 రోజుల పాటు బాధతో నిద్ర కూడా పోయలేదని అన్నారు. అలా వరుసపెట్టి మూడేళ్లలో మూడు విషాదాలు తమ కుటుంబాన్ని వెంటాడాయని తెలిపారు రాజీవ్.
Comments
Post a Comment