RRR పోస్టర్‌పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల చురకలు.. రివర్స్ కౌంటర్ వేసిన చిత్రయూనిట్

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు ఈ మధ్య సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు. అందులోనూ మరీ ముఖ్యంగా ట్రోల్స్, మీమ్స్ చేయడంలోనూ తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. అందులోనూ ప్రత్యేకంగా సినిమా వాళ్లను బాగానే వాడుకుంటున్నారు. సినిమాల నుంచి అప్డేట్లు అంటూ వచ్చే కొత్త కొత్త పోస్టర్లను తమ శైలిలో ఎడిట్ చేస్తుంటారు. సినిమాల్లో హీరోలు బైకులు రైడ్ చేసే పోస్టర్లు వస్తే తమ పనితనాన్ని చూపిస్తుంటారు. ఆ పోస్టర్లను ఎడిట్ చేసి వాటికి హెల్మెట్ పెట్టి ఓ మీమ్ వేస్తుంటారు. అలా తాజాగా ట్రాఫిక్ పోలీసుల దృష్టి మీద పడింది. నేటి ఉదయం ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే పోస్టర్ ఒకటి వచ్చింది. మూవీ షూటింగ్ అప్డేట్ అంటూ టీం ఓ ట్వీట్ వేస్తూ సరికొత్త పోస్టర్‌ను వదిలింది. ఓ రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయిందని, ఇప్పటికే రెండు భాషలకు వీరు డబ్బింగ్ కూడా పూర్తి చేసేశారని , బుల్లెట్ మీద షికార్లు కొడుతున్న ఫోటోను ఆర్ఆర్ఆర్ టీం వదిలింది. ఇక అలాంటి ఫోటో దొరికితే ట్రాఫిక్ పోలీసులు వదులుతారా? తమ టాలెంట్‌ను చూపించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు గ్రాఫిక్స్‌ల్ హెల్మెట్ పెట్టేశారు.. ఇప్పుడు పర్ ఫెక్ట్‌గా ఉందని, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ఉండండి అని ట్వీట్ వేశారు. అయితే ఇలా ట్రాఫిక్ పోలీసులు తమ మీద కౌంటర్ వేయడంతో ఆర్ఆర్ఆర్ టీం రివర్స్ పంచ్ వేసింది. పర్ ఫెక్ట్ అని చెబుతున్నారు..కానీ ఇంకా పర్ ఫెక్ట్ కాలేదు.. ఎందుకంటే బండి నంబర్ మిస్ అయిందని ఆర్ఆర్ఆర్ టీం కన్ను కొట్టేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ టీం నంబర్ ప్లేట్ మిస్ అయిందని చెప్పడంతో అభిమానలు నంబర్ ప్లేట్‌ను డిజైన్ చేసి పెట్టారు. రాజమౌళి 13వ సినిమా ఆర్ఆర్ఆర్ 2021 అంటూ అర్థం వచ్చేలా (SSR 13 RRR 2021) ఎడిట్ చేశారు.
Comments
Post a Comment