MAA పోరుపై విజయశాంతి షాకింగ్ రియాక్షన్.. ఆయన్ను సపోర్ట్ చేస్తూ రాములమ్మ ఓపెన్ కామెంట్స్

మరో రెండు మూడు నెలల్లో ' ఎలక్షన్స్' జరగనుండగా ఇప్పటినుంచే ఫిలిం నగర్ వాతావరణం వేడెక్కింది. అధ్యక్ష పీఠం కోసం పోటీ రసవత్తరంగా మారడంతో ఈ ఎన్నికలపై సినీ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, సీనియర్ నటి జీవిత రాజశేఖర్, హేమ పోటీలో ఉండగా వీరిలో సినీ పెద్దల సపోర్ట్ ఎవరికి లభిస్తుందనేది హాట్ టాపిక్ అయింది. ఇంతలో మరో నటుడు ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలో తలపడనున్నట్లు ప్రకటన చేశారు. మరోవైపు ఇప్పటినుంచే అధ్యక్ష బరిలో ఉన్న పోటీదారులంతా ఎవరికి వారు వ్యూహరచన చేసుకుంటున్నారు. ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ మెంబెర్స్‌ని కూడా ప్రకటించి ప్రెస్ మీట్ ద్వారా కోసం తాను చేయాలనుకుంటున్న పనులపై వివరణ ఇచ్చారు. అలాగే మంచు విష్ణు సైతం అధికారికంగా తాను MAA ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు బహిరంగ లేఖ విడుదల చేసి సినీ కార్మికుల కష్టసుఖాల్లో వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల నడుమ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు సీవీఎల్‌ నరసింహారావు ప్రకటించడం, ప్రత్యేకమైన వాదనతో ఆయన రంగంలోకి దిగుతుండటం ఉత్కంఠకు తెరలేపింది. వృత్తిరీత్యా లాయర్ అయిన సీవీఎల్‌ నరసింహారావు.. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తానని హామీ ఇవ్వడమే గాక, తెలుగు కళాకారులకు అన్యాయం జరుగుతోందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. తెలంగాణ వాదంతో తాను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ హీరోయిన్ .. సీవీఎల్‌ నరసింహారావుకు మద్దతు తెలపడం మరిన్ని చర్చలకు తావిచ్చింది. ''మా ఎన్నికలపై సీవీఎల్‌ నరసింహారావు అవేదన న్యాయమైనది, ధర్మమైంది. నేను మా సభ్యురాలిని కాకపోయినా ఒక కళాకారిణిగా స్పందిస్తున్నా. చిన్న కళాకారుల సంక్షేమం దృష్టా సీవీయల్ అభిప్రాయాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నా'' అంటూ విజయశాంతి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ