అదే నా కల.. ‘దేవుడి’ ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నా.. బండ్ల గణేష్ న్యూస్ చానెల్!

సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. నెటిజన్లు వేసే ప్రశ్నలకు బండ్ల గణేష్ సమాధానాలు ఇస్తుంటారు. ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లకు వెంటనే స్పందిస్తుంటారు. మెగా అభిమానులు గురించి పెట్టే కామెంట్లకు అయితే వెంటనే రియాక్ట్ అవుతుంటారు. ఇక వార్తల్లో హైలెట్ అవ్వడం అన్నది బండ్ల గణేష్‌కు సర్వ సాధారణం. నిన్న ప్రకాష్ రాజ్ ప్యానల్ మీడియా సమావేశం సందర్బంగా బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అందరికంటే ఎక్కువగా బండ్ల గణేష్ స్పీచ్‌కే ఫిదా అయ్యారు. మామూలుగానే బండ్ల గణేష్ మైక్ దొరికితే దంచి అవతల పారేస్తారు. అయితే మెగా అభిమానులు మాత్రం కొన్ని రోజులు ఓ డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. మెగా చానెల్ ఒకటి ఉండాలని, మీడియా ఎప్పుడూ కూడా మెగా ఫ్యామిలీని కించపరిచేలా, తక్కువ చేసి చూపిస్తోందనే భావన అభిమానుల్లో ఉంది. అందుకే చిరంజీవి ఓ ఛానెల్ పెట్టాలని మెగా అభిమానులు డిమాండ్ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్‌ని కూడా అభిమానులు ఇదే డిమాండ్ చేస్తుంటారు. అలా తాజాగా బండ్ల గణేష్‌కు ఓ నెటిజన్ ట్వీట్ పెట్టారు. నమస్తే బండ్ల అన్నా.... మీరు త్వరగా చానల్ పెడతారని.. మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నము... నిజమైన వార్త వినిపిస్తూనే బలమైన మార్పు తీసుకు రాగలము అంటూ జనసేన, పవన్ కళ్యాణ్ తరుపున అడిగినట్టు అడిగేశారు. అయితే దీనికి వెంటనే బండ్ల గణేష్ స్పందించి రిప్లై ఇచ్చారు. అదే నా కల.. ఆ దేవుడి ఆశీర్వాదం కోసం ఎదురుచూస్తున్నాను అని బండ్ల గణేష్ అన్నారు. అయితే బండ్లన్న కూడా చానెల్ పెట్టేయాలనే కోరిక ఉన్నట్టు బయటపడింది. దేవుడి ఆశీర్వాదం అంటే.. పవన్ కళ్యాణ్ సైడ్ నుంచా? లేదా ఆ భగవంతుడా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే బండ్ల గణేష్ ఓ చానెల్‌ను పెట్టే యోచనలోనే ఉన్నట్టున్నారు.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ