అది కేవలం వారి కోసమే చేశాను.. ఇక ఎవ్వరు అడిగినా సరే.. పూనమ్ కౌర్ అసహనం!

పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్‌గా అంత పాపులర్ కాకపోయినా సైడ్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక సినిమా విషయంలో కాకుండా పర్సనల్ విషయాల ద్వారా పూనమ్ కౌర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. క్యాస్టింగ్ కౌచ్, మీటూ ఉద్యమ సమయంలో కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలతో పూనమ్ కౌర్ వెలుగులోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ మధ్య వ్యవహారం గురించి కత్తి మహేష్ చేసిన ఆరోపణలు ఎంతటి వివాదానికి దారి తీశాయో అందరికీ తెలిసిందే. అలా పూనమ్ కౌర్ గత రెండేళ్ల నుంచి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఆమె చేసే పరోక్ష కామెంట్లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల గురించి పూనమ్ కౌర్ ఇన్ డైరెక్ట్ ట్వీట్లు పెడుతుంటారు. అలా ఆమె చేసిన ట్వీట్లు చేయడం, వాటిని మళ్లీ డిలీట్ చేయడం వంటివి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఇక పూనమ్ కౌర్‌కు ఇప్పుడు అవకాశాలేవీ అంతగా లేవు. ప్రతీసారి సీజన్ ప్రారంభమయ్యే సమయంలో పూనమ్ కౌర్ వార్తల్లో వైరల్ అవుతుంటారు. పూనమ్ కౌర్ బిగ్ బాస్ టీంను కలిసిందని, కానీ వారు ఆమెను తీసుకునేందుకు సుముఖంగా లేరనే వార్తలు కనిపిస్తుంటాయి. అలాంటి తప్పుడు వార్తలను పూనమ్ కౌర్ ఖండిస్తుంటారు. అయినా కూడా అలాంటివే కనిపిస్తుంటాయి. బిగ్ బాస్ టీం తనను కలిశారు.. షోకి రమ్మన్నారు కానీ తానే రిజెక్ట్ చేశానని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు. అయితే తాజాగా పూనమ్ కౌర్ తన అసహనాన్ని ప్రదర్శించారు. అయితే ఇందులో పూనమ్ కౌర్ చెప్పిన మాటలను చూస్తే అది బిగ్ బాస్ షోకు సంబంధించిన విషయమే అయి ఉంటుందని తెలుస్తోంది. ప్రముఖ చానెళ్లను తన కోసం తన ఫ్రెండ్స్, తన ఫ్యామిలీ మెంబర్స్‌కు కాల్స్ చేస్తున్నారట.. అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి టీవీ షోల్లో కనిపించాలనే ఇంట్రెస్ట్ తనకు లేదని గట్టిగా చెప్పుకొచ్చారు. ఆ స్వర్ణ ఖడ్గం కూడా అడిగారనే కారణంతోనే ఒప్పుకున్నాను.. రాణి పాత్ర కాబట్టే అంగీకరించాను అని చెప్పుకొచ్చారు. అయితే పూనమ్ కౌర్ అసహనం.. బిగ్ బాస్ నిర్వహకుల మీదనా? లేక మిగతా చానెల్స్ వారు ప్రారంభించే ఏదైనా కొత్త షో, సీరియల్ మీదనా? అనేది క్లారిటీగా తెలియడం లేదు. మొత్తానికి పూనమ్ కౌర్ వేసిన ట్వీట్‌తో సదరు చానెళ్లు సెలైంట్ అవుతాయో లేదా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెడతాయో అన్నది చూడాలి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ