Sri Reddy: వాళ్లంతా నా రంకు మొగుళ్లు.. ఏకంగా సీఎంపై కామెంట్స్.. అల్లు అర్జున్ ఫొటోతో నయా సెన్సేషన్

సోషల్ మీడియాలో శ్రీరెడ్డి చేసే రచ్చ గురించి చెప్పుకుంటూ పోతే ఓ పుస్తకమే రాసేయొచ్చు. ఒకానొక సమయంలో కాస్టింగ్ కౌచ్ ఉద్యమంతో నడిరోడ్డు మీద అర్దనగ్న ప్రదర్శన చేసి దేశవ్యాప్త సంచలనం క్రియేట్ చేసిన ఈ లేడీ యాక్ట్రెస్.. వీలు కుదిరినప్పుడల్లా టాలీవుడ్, కోలీవుడ్ బడా బాబులకు టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం కాస్త ట్రాక్ మార్చి మీమ్ క్రియేటర్స్‌పై తన అస్త్రాన్ని వదిలింది . మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ అంటే అస్సలు పడని శ్రీ రెడ్డి ఏ చిన్న సందర్భం దొరికినా ఆయనను వదిలిపెట్టదు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌కి కరోనా సోకడంతో శ్రీ రెడ్డి చేసిన బోల్డ్ కామెంట్స్ అన్నీఇన్నీ కావండోయ్. పవర్ స్టార్‌కి కోవిడ్ అని తెలిసింది మొదలు నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చే వరకు ఆయనపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ శ్రీ రెడ్డిపై ఓ రేంజ్‌లో అటాక్ చేస్తూ విమర్శనాత్మకంగా మీమ్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఉన్నట్టుండి అల్లు హీరోలపై కామెంట్ వదలడం హాట్ ఇష్యూ అయింది. శ్రీ రెడ్డి భవిష్యవాణి అంటూ 'అల్లు గాడి కెరీర్ క్లోజ్ అయిపోయే రోజు వచ్చిందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది' అనే కామెంట్ చేసింది. దీంతో ఈ మాట అల్లు అర్జున్‌నే అనేసిందని బన్నీ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎవ్వరూ ఊహించని విధంగా బన్నీకి కరోనా పాజిటివ్ అని తెలియడంతో శ్రీ రెడ్డి మళ్ళీ లైన్ లోకి వచ్చేసింది. ఏకంగా పుష్ప సినిమాలోని లుక్ పోస్ట్ చేస్తూ ''నేనన్నానా అలా అన్నానో లేదో?? మన పుష్పానికి కరోనా వచ్చేసిందట ఫాఫమ్ రండ్రా మీమ్స్ యేసుకుందాం'' అంటూ తన ఫేస్‌బుక్ ఖాతాలో కామెంట్ వదలడం మరోసారి రచ్చకు తెరలేపింది. ఇక దీంతోపాటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా మరో పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలనే కారణంతో ఓ పెద్ద పార్టీ అరవింద్ కేజ్రీవాల్‌కు సహకరించడం లేదని, ఢిల్లీలో జరుగుతున్న అన్నిటికీ కేజ్రీవాలే కారణం అన్నట్లుగా మీడియా కూడా ఆయననే టార్గెట్ చేస్తోందని కామెంట్ చేసింది. అంతటితో ఆగక ఈ పోస్ట్‌పై.. 'మీమ్ క్రియేటర్స్ అంతా నా రంకు మొగుళ్లు' అంటూ తనదైన స్టైల్ కామెంట్ వదిలింది శ్రీ రెడ్డి. మీరు నాకు దేవుడు ఇచ్చిన మొగుళ్ళు రా అంటూ రచ్చరచ్చ చేసింది. సో.. ఇంతలా కెలికాక మీమ్ క్రియేటర్స్ ఊరుకుంటారా? లేక శ్రీ రెడ్డిపై ఇంకాస్త రెచ్చిపోయి మీమ్స్ క్రియేట్ చేస్తారా? అనేది చూడాలి మరి.


Comments

Popular posts from this blog

అభిమాని మరణంతో ఎమోషనల్.. ఎప్పటికీ గుర్తుండిపోతావ్.. విజయ్ కంటతడి

‘కె.జి.యఫ్’ నిర్మాత నుంచి మరో పాన్ ఇండియా మూవీ

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఆపరేషన్... ఆ భాగాన్ని మార్చుకున్న బ్యూటీ